Premalu Telugu Movie Review: తెలుగు లో లవ్ స్టోరీ సినిమాలకు గాని, యూత్ ఫుల్ ఎంటర్టైనర్లకు గాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏ భాషలో వచ్చిన సినిమా అయిన సరే తెలుగులో డబ్ అయింది అంటే తెలుగు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉంటే చాలు ఆ సినిమా ఇక్కడ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. మన వాళ్లు సినిమా బాగుంటే అది ఏ భాష సినిమా అయిన పర్లేదు ఆదరించడంలో ముందుంటారు. అని చెప్పడానికి ఈ ఒక్క చిన్న ఉదాహరణ చాలు…
ఇక గత సంవత్సరం లవ్ టుడే అనే సినిమాతో ప్రదీప్ రంగనాథన్ ఒక పెద్ద మ్యాజిక్ చేశాడు. చిన్న సినిమాగా తెలుగులో డబ్ అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అదే తరహా లో మన ముందుకు వచ్చింది. మలయాళం సూపర్ హిట్ సినిమా ప్రేమలు…ఈ సినిమా కూడా తెలుగులో డబ్ అయింది. గత నెల రోజుల క్రితం ఈ సినిమా మలయాళం లో రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించగా ఈరోజు తెలుగులో రిలీజ్ అయింది.ఇక ఈ సినిమా మన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది. మలయాళం లో సాధించినట్టుగానే ఇక్కడ కూడా సూపర్ హిట్ ను సాధించిందా లేదా అనే విశేషాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ మూవీ లో పెద్దగా స్టోరీ ఏమీ లేదు. ఒక బీటెక్ అబ్బాయి, ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ నే ఈ సినిమాగా చెప్పుకోవచ్చు. హీరో యూకే వెళ్లడానికి ప్రయత్నం చేస్తుండగా ఆయన వీసా క్యాన్సిల్ అవుతుంది. ఇక దాంతో ఫ్రెండ్ సలహా మేరకు గేట్ కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ కి వస్తాడు. అక్కడ ఆయనకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. వీళ్ళ మధ్య జరిగే లవ్ స్టోరీనే చాలా కామెడీగా ఎంటర్టైన్ చేసే విధంగా తీశాడు. అయితే అక్కడక్కడ చిన్నచిన్న ఎమోషన్స్ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా స్ట్రాంగ్ గా చూపించాడు. అయితే హీరో హీరోయిన్స్ మధ్య ఒక సందర్భం లో మిస్ కమ్యూనికేషన్ వస్తుంది.అయితే వీళ్లిద్దరు చివర్లో కలుసుకుంటారా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయాన్ని వస్తే దర్శకుడు గిరీష్ ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించే ప్రయత్నం చేశాడు. నిజానికి ఈ సినిమాలో కథ లేకపోవడం వల్లే దర్శకుడు ఎంటర్ టైనింగ్ అంశాలు ఎక్కువగా పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇక దీంట్లో తను రాసుకున్న లవ్ సీన్లు చాలా వరకు ప్రేక్షకుల్ని అలరించాయనే చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళ లవ్ స్టోరీ లో వచ్చే సీన్స్ గాని, హీరో ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్ గాని ప్రతిదీ ఈ సినిమాని టాప్ లెవెల్లో నిలిచేలా చేశాయనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ సినిమా హైదరాబాద్ ని బేస్ చేసుకుని రావడం అనేది కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది. ఇక మన నేటి వీటికి సంభందించిన స్టోరీ కాబట్టి ఈ సినిమాకి ప్రేక్షకులు ఈజిగా కనెక్ట్ అవుతారు. నిజానికి డబ్బింగ్ సినిమాలు మనకి కనెక్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ ఇది మన నేటి వేటితోనే తెరకెక్కిన సినిమా కాబట్టి ఫస్ట్ సీన్ లోనే ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. ఇక ఇలాంటి సినిమాలను కూడా చేసి మంచి విజయాలు సాధించవచ్చు అని గిరీష్ ప్రూవ్ చేశాడు. హెవీ ఎమోషన్స్, ఎలివేషన్స్ , సెంటిమెంటల్ సీన్స్ ఏమీ లేకుండా ఒక రెండు గంటల పాటు సినిమాను చూసి హాయిగా ఎంజాయ్ చేసేసి రావచ్చు. పెద్దగా లాజిక్ ని కూడా పట్టించుకోకుండా ఈ సినిమాని చూస్తే మాత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది.. ఇక ఈ సినిమాలో విష్ణు విజయ్ మ్యూజిక్ కూడా బాగుంది. అయితే ఈ సినిమాకి సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ లేకపోవడం కూడా మైనస్ గా మారింది.
ఎందుకంటే ఒక కథని గానీ, ఒక సినిమాను గానీ మనం చదివినప్పుడైనా, లేదా చూసినప్పుడైనా అది ఎమోషనల్ గా మనకు కనెక్ట్ అయినప్పుడే దాన్ని మనం ఓన్ చేసుకోగలుగుతాం. లేదు అంటే ఎంతసేపు కామెడీ ఉన్నా కూడా అది మనది అని మనమైతే ఫీల్ అవ్వము.ఈ విషయంలో ఈ సినిమాకి కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి… ఇక అజ్మల్ సబు సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక హైదరాబాద్ లో ఉన్న ప్రతి లొకేషన్ ను వాడుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. హైదరాబాద్ లో ఉంటున్న వాళ్లకు కూడా ఇన్ని లొకేషన్స్ ఉన్నాయా అనే ఆశ్చర్యపోయేంతలా డైరెక్టర్ మెస్మరైజ్ చేశారనే చెప్పాలి…
నటీనటుల పర్ఫామెన్స్
ఇక లీడ్ రోల్ లో చేసిన నెల్సన్, మమితాలు ఇద్దరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా చేశారు. ఆద్యంతం ఎంగేజ్ చేయడంలో వీళ్ళ పాత్రలు చాలా కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి ప్రతి సీన్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా చేశారు. అల్తాఫ్ సలీం కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించాడు. ఇక హీరో హీరోయిన్లకు సపోర్ట్ గా తన పాత్ర ఉండటం వల్ల అవకాశం వచ్చిన ప్రతిసారి తనని తాను ప్రూవ్ చేసుకుంటూ తన వల్ల సినిమాకి చాలా వరకు హెల్ప్ అయ్యాడు…
ఇక మిగతా పాత్రల్లో పోషించిన ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకైతే న్యాయం చేయగలిగారు…
టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే విష్ణు విజయ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉండటమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫిల్ ఇచ్చే విధంగా ఉంది. ఇప్పటివరకు మనం చూసిన సినిమాల మ్యూజిక్ లన్ని కాపీ మ్యూజిక్ లు, డ్రమ్స్ తో ప్లే చేసిన మ్యూజిక్ విన్నాం కానీ మనోడు వయిలిన్ గిటార్లతో మ్యూజిక్ చేశారనే చెప్పాలి. ప్రతి సౌండ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది ముఖ్యంగా బీజీఎం అయితే బాగుంది… అజ్మల్ సబు సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు మనం చూడని విధంగా షాట్స్ కంపోజ్ చేసుకొని చాలా బాగా అవుట్ ఫుట్ వచ్చేలా చేయడం అనేది అజ్మల్ సబు కే చెల్లింది. నిజంగా ఈ సినిమా అనేది సమిష్టి కృషి ద్వారానే వర్కౌట్ అయిందనే విషయం అర్థమవుతుంది. ఇక ఫాహద్ ఫజిల్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండడం సినిమాను మరొక మెట్టు పైకెక్కిచ్చిందనే చెప్పాలి…
ప్లస్ పాయింట్స్
డైరెక్షన్
కొన్ని సీన్స్ అయితే హిలెరియస్ గా వర్కౌట్ అయ్యాయి..
మైనస్ పాయింట్స్
కథ
ఎమోషన్స్
రేటింగ్
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5
చివరి లైన్
మాకు ఎమోషన్స్ తో పనిలేదు. ఒక రెండు గంటలు ఎంటర్ టైన్ అయితే చాలు అనుకున్న వారు ఈ సినిమాకి వెళ్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు..