Flight Accident: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(సీడీఎస్) బిపిన్ రావత్ నిన్న మధ్యాహ్నం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటనలో ఆయన భార్య మధులికతోపాటు మరో 12మంది మృతిచెందడం యావత్ దేశాన్ని కలిచివేసింది. పైలట్ మాత్రం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషయంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత మరో దేశవ్యాప్తంగా విమాన ప్రమాదాలపై చర్చ నడుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ హెలికాప్టర్ ప్రమాదంలోనే మృతిచెందారు. ఈ సంఘటనను జీర్ణించుకోలేక నాడు పలువురు వైఎస్ అభిమానులు మృతిచెందారు. హీరోయిన్ సౌందర్య సైతం హెలికాప్టర్ ప్రమాదంలోనే మృతిచెందాడం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె లేనిలోటును సినీ పరిశ్రమ ఇప్పటికీ పూడ్చలేకపోతుంది. ఇక ఓ భారీ ప్రమాదం నుంచి టాలీవుడ్ సెలబ్రెటీలు రెండు దశాబ్దాల క్రితం బయటపడగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది.
గత 28ఏళ్ల కిందట ఓ విమాన ప్రమాదం నుంచి టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు తృటిలో బయటపడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 66మంది సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు ఈప్రమాదం నుంచి బయటపడటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఊపిరిపీల్చుకుంది. బిపిన్ రావత్ మృతి తర్వాత మరోసారి ఈ సంఘటన గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ చర్చించుకుంటోంది.
1993 నవంబర్ 15న టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులతో సహా మొత్తం 272మంది ఓ విమానంలో చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. ఉదయం 6గంటలకు బయలుదేరిన ఈ విమానంలో టాలీవుడ్ కు చెందిన చిరంజీవి, బాలకృష్ణ, అల్లురామలింగయ్య దంపతులు, విజయశాంతి, మలాశ్రీ, సుధాకర్, బ్రహ్మనందం, కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర్లు తదితర ప్రముఖుల వాళ్ల కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తున్నారు.
విమానం గాల్లో ఉండగానే రెక్కలకు ఉండే ప్లాప్స్, స్లాట్స్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో లాండింగ్ కోసం తెరుచుకున్నాయి. అయితే వాతావరణం సహకరించకపోవడంతో ల్యాండింగ్ జరుగలేదు. మళ్ళీ పైకి ఎగురుతున్న సమయంలోనే సాంకేతిక లోపంతోపాటు ఇంధన లోపం సంభవించింది. ఈ సమయంలో సాధారణంగా ఫ్లైట్ క్రాష్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: హెలిక్యాప్టర్ ప్రమాదంలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కన్నుమూత
కానీ అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరుగలేదు. కెప్టెన్ భల్లా, కో వేల్‌రాజ్ తమ సమయస్ఫూర్తితో వెంకటగిరి సమీపంలోని పొలాల్లో విమానాన్ని ల్యాండ్ చేశారు. పొలాల్లో విమానం కొంచెం ఒరిపోయింది. అయినా ఫ్లైట్ లోని ఏ ఒక్కరికి ఎలాంటి ప్రమాదం జరుగకుండా బయటపడ్డారు.
ఇప్పటికీ కూడా ఈ సంఘటనను తలుచుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి వెన్నులో వణుకుపడుతోంది. నిజంగా ఆనాడు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే మాత్రం అది టాలీవుడ్ కే కాకుండా యావత్ దేశానికి తీరని లోటుగా మిగిలిపోయి ఉండేది. దేవుడి దయతో వారంతా క్షేమంగా బయటపడి వాళ్ల అభిమానులను అలరించేలా ఇంకా సినిమాలను చేస్తున్నారు.
Also Read: బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.!