RRR Theatrical Trailer: వైల్డ్ టైగర్ తో యంగ్ టైగర్ పోరాడితే… మైండ్ బ్లాక్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ హైలెట్స్!

RRR Theatrical Trailer: ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రాజమౌళి టీమ్ ఆర్ ఆర్ ఆర్ తో సిద్ధం అవుతుంది. టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో రికార్డులను వేటాడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలు ఎవరెస్టు కి చేర్చాయి. ఇక ట్రైలర్ తో ఆర్ ఆర్ ఆర్ మూవీ స్థాయిని ఆకాశానికి తీసుకెళ్లాలని రాజమౌళి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ని వెండితెరపై […]

Written By: Shiva, Updated On : December 9, 2021 10:35 am
Follow us on

RRR Theatrical Trailer: ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రాజమౌళి టీమ్ ఆర్ ఆర్ ఆర్ తో సిద్ధం అవుతుంది. టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో రికార్డులను వేటాడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలు ఎవరెస్టు కి చేర్చాయి. ఇక ట్రైలర్ తో ఆర్ ఆర్ ఆర్ మూవీ స్థాయిని ఆకాశానికి తీసుకెళ్లాలని రాజమౌళి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ని వెండితెరపై రాజమౌళి ఎలా ఆవిష్కరించారో తెలిపే ట్రైలర్ విడుదలకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ విడుదల కానుంది.

RRR Theatrical Trailer

బాహుబలితో చరిత్ర తిరగరాసిన రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ఎలా ఉండనుందనే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగిపోగా, బయటికి వస్తున్న సమాచారం గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ని రాజమౌళి యాక్షన్, ఎమోషన్ అంశాలు ప్రధానంగా ఉండేలా కట్ చేశారట. మూడు నిమిషాలకు పైగా సాగే ట్రైలర్ లో సినిమా ఆత్మను పరిచయం చేయనున్నాడట.

184 సెకండ్ల నిడివి కలిగిన ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ అబ్బురపరచనున్నాయట. రామ్ చరణ్, ఎన్టీఆర్ పై తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలు విజువల్ ట్రీట్ లా ఉండటం ఖాయం అంటున్నారు. ముఖ్యంగా పులితో ఎన్టీఆర్ ఫైట్ ట్రైలర్ లో హైలెట్ అన్నమాట వినిపిస్తుంది. రియలిస్టిక్ గా తెరకెక్కిన పులితో ఎన్టీఆర్ వీరోచిత పోరాటం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులను గుండెలు దద్దరిల్లేలా చేస్తుందట.

ఇక నార్త్ ప్రేక్షకుల కోసం ట్రైలర్ లో అజయ్ దేవగణ్, అలియా భట్ కూడా ప్రముఖంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారట. సినిమాలోని ప్రధాన పాత్రలు అన్నింటినీ పరిచయం చేయనున్నారట. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ నభూతో నభవిష్యతి అన్నట్లు రాజమౌళి రూపొందించారట. ఇక నేడు ముంబైలో 12 గంటలకు ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుంది. సల్మాన్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Also Read: Ram Charan: అనుష్పాల వేడుకలో రాయల్ ​లుక్​లో రామ్​చరణ్​, ఉపాసన.. నెట్టింట్లో పిక్స్ వైరల్​

నేడు సాయంత్రం ఆర్ ఆర్ ఆర్ టీమ్ హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. డిసెంబర్ 10న బెంగుళూరు, చెన్నై నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ సందడి చేయనుంది. పలు నగరాల్లో ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే రాజమౌళి తెలిపారు. డివివి దానయ్య రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. జనవరి 7న వరల్డ్ వైడ్ గా రికార్డు థియేటర్స్ లో విడుదల కానుంది.

Also Read: Pushpa Movie: “పుష్ప” నుంచి ‘ఊ అంటావా… ఊహు అంటావా’ అంటూ వచ్చేస్తున్న సమంత…

Tags