https://oktelugu.com/

వారి వల్ల మెగాభిమానులకు గొప్ప అనుభూతి !

‘చిరంజీవి’ మెగాస్టార్ గా టాలీవుడ్ ని శాసిస్తున్న రోజులు అవి. వరుస కమర్షియల్ సినిమాలతో చిరు ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వెళ్తున్నారు. అయితే చిరుకి చిన్న అసంతృప్తి. అందుకే, కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ‘ట్రిపుల్ రోల్ ప్లే’. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేశారు చిరు. మొదటిసారి చిరు మూడు గెటప్స్ లో కనిపిస్తున్నారు అనగానే ‘ముగ్గురు మొనగాళ్లు’ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. […]

Written By: , Updated On : July 17, 2021 / 05:26 PM IST
Follow us on

Mugguru Monagallu Movie‘చిరంజీవి’ మెగాస్టార్ గా టాలీవుడ్ ని శాసిస్తున్న రోజులు అవి. వరుస కమర్షియల్ సినిమాలతో చిరు ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వెళ్తున్నారు. అయితే చిరుకి చిన్న అసంతృప్తి. అందుకే, కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ‘ట్రిపుల్ రోల్ ప్లే’. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేశారు చిరు.

మొదటిసారి చిరు మూడు గెటప్స్ లో కనిపిస్తున్నారు అనగానే ‘ముగ్గురు మొనగాళ్లు’ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కట్ చేస్తే.. 1994 వ సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. సినిమా చూసిన వారందరికీ ఒక్కటే డౌట్. అసలు చిరు ముగ్గురుగా ఎలా నటించారు. ఏ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అంత సహజంగా ఎలా కనిపించారు ? అంటూ ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది.

ముఖ్యంగా చిరు మూడు పాత్రలలో పలికించిన హావ భావాలు చాల బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ముగ్గురు చిరంజీవిలు పోటీ పడి నటించారా అన్నట్టు ఉంటుంది ఒక్కో సీన్. అయితే, ఈ మూడు గెటప్స్ ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం చిరుతో పాటు డూప్స్ గా నటించిన నటులు కూడా.

డూప్స్ గా నటించిన ఆ నటులు.. మెగాభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని ఇచ్చారనడంలో అతిశయోక్తి లేదు. మరి ఇంతకీ చిరుకి డూప్స్ గా నటించింది ఎవరు ? అనే అనుమానం అప్పట్లో పెద్ద టాపిక్. ఆ రోజుల్లో ఈ డూప్స్ గురించి కొంతమందికి తెలిసినా ప్రేక్షకులకు మాత్రం అసలు డూప్స్ ఎవరో ఇప్పటికీ తెలియదు.

దర్శకుడు రాఘవేంద్ర రావుగారు డూప్స్ ను సెలెక్ట్ చేసే క్రమంలో చిరంజీవిని పోలిన ఇద్దర్నితీసుకున్నారు. అందులో ఒకరు చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ ‘సుబ్బారావు’, అదే విధంగా మరో పాత్రకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘హరి బాబు’. వీరిని సెలెక్ట్ చేయడానికి చిరు కూడా ఒక కారణం అట. సుబ్బారావు తనకు డూప్ గా సెట్ అవుతాడని చిరు ఫీల్ అయ్యారు. ఇక హరిబాబు విషయంలో కూడా చిరు నిర్ణయమే ఫైనల్ అయింది.