టాలీవుడ్ నిర్మాత ‘ఓ రాత్రి నాతో గడుపు’ అన్నాడన్న ప్రముఖ నటి

సినీ ఇండస్ట్రీ అన్నాక ‘కాంప్రమైజ్’ కానిదే స్టార్ హీరోయిన్లు అవ్వలేరని ఒక టాక్ ప్రచారంలో ఉంది. అలా కాంప్రమైజ్ అయిన వారే స్టార్లుగా వెలుగొందుతారని చెబుతారు. అయితే అందరూ దానికి తలొగ్గారు. తలొగ్గిన వారు నోరెత్తరు. కానీ ‘మీటూ’ ఉద్యమం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలోని లూప్ హోల్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ నిర్మాతపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల ఒక పుస్తకంలో ప్రముఖ నటి రాసుకొచ్చింది. తన జీవితంలో […]

Written By: NARESH, Updated On : July 17, 2021 6:15 pm
Follow us on

సినీ ఇండస్ట్రీ అన్నాక ‘కాంప్రమైజ్’ కానిదే స్టార్ హీరోయిన్లు అవ్వలేరని ఒక టాక్ ప్రచారంలో ఉంది. అలా కాంప్రమైజ్ అయిన వారే స్టార్లుగా వెలుగొందుతారని చెబుతారు. అయితే అందరూ దానికి తలొగ్గారు. తలొగ్గిన వారు నోరెత్తరు. కానీ ‘మీటూ’ ఉద్యమం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలోని లూప్ హోల్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ నిర్మాతపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు చేసింది.

ఇటీవల ఒక పుస్తకంలో ప్రముఖ నటి రాసుకొచ్చింది. తన జీవితంలో జరిగిన అనుభవాలను అందులో ఉంచింది. ఆ పుస్తకంలో ఓ టాలీవుడ్ డైరెక్టర్ గురించి ప్రస్తావించడంతో హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తరువాత ఈ విషయం బయటపడడంతో సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

నీనా గుప్తా.. అప్పట్లో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. తన 40 ఏళ్ల జీవితంలో జరిగిన సంఘటనల గురించి ‘సచ్ క: తో ’ అనే పుస్తకంలో వివరించింది. ‘ఓకరోజు ఫృథ్వీ థియేటర్లో నేనుండగా దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ నిర్మాత నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయన ఉన్న హోటల్ పక్కనే ఉండడంతో వెంటనే అక్కడికి వెళ్లారు. ఆయన తన గదిలోకి రమ్మన్నాడు. ఆ గదిలో ఎవరూ లేరు. అవకాశాలు రావాలి కాబట్టి గదిలోకి వెళ్లాను. అప్పుడే ఆ నిర్మాత ‘నా వల్ల ఎంతో మంది హీరోయిన్లు స్టార్లు అయ్యారు’ అని అన్నారు. వెంటనే నేను ‘నాకు ఏ క్యారెక్టర్ ఇస్తున్నార్ సార్’ అని అడిగాను. దీంతో అతను ‘హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్’ అని చెప్పాడు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను.’’ అని చెప్పుకొచ్చింది.

ఈ రాత్రి నాతో ఉండవా.. అని ఆ నిర్మాత అన్నాడని.. అలా ఉంటే అవకాశాలు వస్తాయని చెప్పాడని వివరించింది. అందుకు నేను ఒప్పుకోలేదని నీనా గుప్తా తెలిపింది. నిన్ను బలవంతం చేయనని.. నీకు ఇష్టమైతేనే అని అన్నాడని నీనా గుప్తా తెలిపింది. దీంతో అక్కడి నుంచి వచ్చేశానంది. అంతేకాదు ఆ ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేశాడని వివరించింది.

అలాగే బాలీవుడ్లో ని కొందరు హీరోలు కూడా నాతో ఇలాగే ప్రవర్తించారు అని నీనా గుప్త తన బుక్ లో సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. దీంతో ఆమె రాసిన బుక్ ఇప్పుడు పెను సంచలనమైంది. ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.