https://oktelugu.com/

Prakash Raj: ప్రకాష్ రాజ్ ను స్టార్ నటుడిగా మార్చిన డైరెక్టర్స్ ఎవరంటే.?

విలక్షణ నటుడుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ సక్సెస్ ఫుల్ నటుడిగా మంచి తనకంటూ ఒక స్టార్ డమ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 9, 2024 / 04:11 PM IST

    Prakash Raj

    Follow us on

    Prakash Raj: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆర్టిస్టు లు గొప్ప నటులుగా మారడానికి చాలా మంది దర్శకులు హెల్ప్ అవుతూ ఉంటారు. ఒక నటుడి లో ఎంత టాలెంట్ ఉన్నా కూడా దాన్ని బయటికి తీసే క్యారెక్టర్ పడినప్పుడే ఆయనలోని నటుడు ప్రపంచానికి కనిపిస్తాడు. ఇక ఇలాంటి విషయంలో విలక్షణ నటుడుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ సక్సెస్ ఫుల్ నటుడిగా మంచి తనకంటూ ఒక స్టార్ డమ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

    ఇక ఈయనని సక్సెస్ ఫుల్ నటుడిగా మార్చడంలో మాత్రం చాలా మంది దర్శకులు పాత్ర ఉంది. అందులో ముఖ్యంగా పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, కృష్ణవంశీ, గుణశేఖర్, వివి వినాయక్, బొమ్మరిల్లు భాస్కర్ లాంటి దర్శకులు ముందు వరుస లో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆయనకు మంచి క్యారెక్టర్లు రాయడం వల్లే ఆయన పాత్ర అనేది ఎలివేట్ అవుతూ ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది.

    ఈయన ఏ పాత్రనైనా ఈజీగా చేయగలడు అనేంతలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన నటుడిగా ఇప్పటివరకు ఐదు నేషనల్ అవార్డులని కూడా గెలుచుకున్నాడు అంటే ఆయన నటనలో ఎంత దమ్ము ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక మొత్తానికైతే ఆయన చేసిన అన్ని సినిమాల్లో కలిపి ప్రకాష్ రాజ్ కి ఎక్కువగా నచ్చిన క్యారెక్టర్ మాత్రం కృష్ణ వంశీ డైరెక్షన్ లో అంతఃపురం సినిమాలో ఫ్యాక్షనిస్టుగా నటించిన ఆ క్యారెక్టర్ అంటే ఆయనకి చాలా ఇష్టమట. ఎందుకంటే ఆ పాత్రలో తను నటించడానికి చాలా షేడ్స్ అయితే ఉంటాయి.

    ఇక ఆ పాత్ర చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ నేషనల్ అవార్డ్ లతో పాటు చాలా అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఇక నిజానికి ఒక నటుడికి ఏం కావాలో దానికి మించి సక్సెస్ ని సాధించిన నటుడిగా ప్రకాష్ రాజ్ నిలిచాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతి క్యారెక్టర్ లో నటించి తన మార్కు నటనను చూపించడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు…