https://oktelugu.com/

Sujeeth And Buchi Babu: సుజీత్, బుచ్చిబాబు ఇద్దరిలో ఎవరు పాన్ ఇండియా లో టాప్ డైరెక్టర్ గా మారబోతున్నారు…

ప్రస్తుతం సినిమాను చూసే ప్రేక్షకుడి దృష్టి మొత్తం మారిపోయింది. దానికోసమే మన దర్శకులు కూడా చాలా ఇన్నోవేటివ్ థాట్స్ తో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Written By: , Updated On : September 11, 2024 / 10:48 AM IST
Sujeeth And Buchi Babu

Sujeeth And Buchi Babu

Follow us on

Sujeeth And Buchi Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్టార్ డైరెక్టర్లందరూ పాన్ ఇండియా డైరెక్టర్లుగా ఎదుగుతున్న క్రమంలో కొంత మంది యంగ్ డైరెక్టర్స్ సైతం తమను తాము ప్రూవ్ చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సుజిత్ లాంటి దర్శకుడు సాహో సినిమాతో పాన్ ఇండియా సినిమా చేసి గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి సాహో సినిమా తెలుగులో పెద్దగా ఆడనప్పటికి బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రం చాలా వరకు ఆకట్టుకుందనే చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మరి ఈ సినిమా విషయంలో సుజీత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈయన ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాల అవుతున్నప్పటికి ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలను మాత్రమే రిలీజ్ చేశాడు…ఇక వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ఓజీ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే సుకుమార్ శిష్యుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడంతో మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ దర్శకుడు తన తర్వాత సినిమాని రామ్ చరణ్ తో చేస్తున్నాడు. నిజానికి ఈయనకు వచ్చిన సక్సెస్ చాలా గొప్పదనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ తో కనక చేసే సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే తనను మించిన దర్శకుడు మరొకరు ఉండరనేది మాత్రం వాస్తవం.. ఇక పాన్ ఇండియాలో ఆయన లాంటి దర్శకుడు లేరని చెప్పవచ్చు. నిజానికి బుచ్చిబాబు ఎమోషన్స్ తో సీన్స్ ని రాసుకుంటాడు. కాబట్టి ఆయన సినిమాలో సగటు ప్రేక్షకులు ఇన్వాల్వ్ అవుతూ సినిమాని ఎంజాయ్ చేస్తారు.

మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ఉప్పెన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక పాత తరం దర్శకులందరూ ఫేయిడ్ ఔట్ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ యంగ్ డైరెక్టర్లలో ఎవరు పాన్ ఇండియాని శాసించే దర్శకుడిగా ఎదుగుతారు అనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే వీళ్లలో ఎవరు టాప్ డైరెక్టర్ గా ఎదుగుతారనేది తెలిసిపోతుంది…