https://oktelugu.com/

TDP-Janasena : చితకబాదారు.. కాళ్లు పట్టించుకున్నారు.. జనసైనికుడి పై టిడిపి దాష్టికం

ఏపీలో కూటమి పార్టీల మధ్య సమన్వయం నీటి బుడగలా మారుతోంది. నాయకత్వాల మధ్య సరైన సమన్వయం కొనసాగుతున్నా.. కింది స్థాయిలో మాత్రం అంతరం కొనసాగుతోంది. పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : September 11, 2024 / 10:53 AM IST

    TDP-Janasena

    Follow us on

    TDP-Janasena :  ఏపీలో కూటమి ప్రభుత్వం పదేళ్లు పాటు కొనసాగాలని పవన్ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కూటమి పార్టీల మధ్య మంచి సమన్వయమే కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ విషయంలో సీఎం చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అన్ని అంశాల్లో ఆయనకు గౌరవం ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ సైతం చంద్రబాబు నాయకత్వానికి జై కొడుతున్నారు. ఆయన సమర్థతను మెచ్చుకుంటున్నారు. పై స్థాయిలో మంచి సమన్వయం కొనసాగుతోంది. కానీ కింది స్థాయిలో మాత్రం విభిన్న పరిస్థితులు ఉన్నాయి.తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని జనసేన నేతలు లోలోపల రగిలిపోతున్నారు. టిడిపి నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మచిలీపట్నంలో ఇటువంటి వివాదమే బయటపడింది. జనసైనికులతో టిడిపి నేతలు కాళ్లు పట్టించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎంతవరకు దారితీస్తుందోనన్న ఆందోళన ఇరు పార్టీల్లో ఉంది.

    * ఫ్లెక్సీల చించివేత
    మచిలీపట్నం పరాసుపేటలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వేడుకల వద్ద భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో జనసేన నేతలకు చోటు కల్పించలేదు. దీంతో ఆ పార్టీకి చెందిన ఎర్రం శెట్టి నాని, సాయన శ్రీనివాసరావు అనే ఇద్దరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీ ని చించేశారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన టిడిపి శ్రేణులు ఎర్రంశెట్టి నాని ఇంటిపై దాడి చేశారు. ఆయనపై చేయి చేసుకున్నారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. కూటమి పార్టీల నేతలు ఎంటరయ్యారు. వివాదాన్ని సద్దుమణిగించారు. దీంతో అక్కడితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు.

    * రక్తం వచ్చేలా కొట్టి
    అయితే మరుసటి రోజు ఎర్రం శెట్టి నాని ఇంటిపై మరోసారి దాడి చేశారు టిడిపి నేతలు. శ్రీనివాసరావును రక్తం వచ్చేలా కొట్టారు. తీవ్రంగా గాయపరిచారు.అంతటితో ఆగకుండా బాధితుడితో టిడిపి నేతల కాళ్లు పట్టించారు.క్షమాపణలు కూడా చెప్పించారు. అనంతరం ఇరు పార్టీల వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మరోవైపు ఇలా కాళ్లు పట్టించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.

    * సోషల్ మీడియాలో రచ్చ
    అయితే ఈ ఘటనతో సోషల్ మీడియాలో టిడిపి, జనసేన మధ్య రచ్చ నడుస్తోంది. రెండు పార్టీల శ్రేణులు పరస్పరం దూషించుకుంటున్నాయి. టిడిపి శ్రేణులతో సమన్వయం విషయంలో పవన్ జనసైనికులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టిడిపి నేతలు ఏకంగా జనసైనికుడిని చావబాదడం, కాళ్లు పట్టించుకోవడం సీరియస్ అంశంగా మారింది. దీనిపై జనసేన హై కమాండ్ ఎలా స్పందిస్తుందో