https://oktelugu.com/

Satya Sundaram : సత్య సుందరం సినిమాకి మన తెలుగు హీరోల్లో ఎవరు సెట్ అయ్యేవారు…

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక రొటీన్ రొట్ట కథ సినిమాలకు స్వస్తి చెబుతూ కొత్త కథలను ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకులు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 22, 2024 1:15 pm
    Who among our Telugu heroes would be set for Satya Sundaram?

    Who among our Telugu heroes would be set for Satya Sundaram?

    Follow us on

    Satya Sundaram : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. నిజానికి వాళ్ళు తీసే సినిమాలు మన తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే రీసెంట్ గా 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘సత్యం సుందరం’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తమిళ్ సినిమా అయినప్పటికి తెలుగులో కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ దక్కడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. కార్తీ అరవిందస్వామి ముఖ్య పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకి భారీ క్రేజ్ అయితే దక్కింది. ముఖ్యంగా ఈ సినిమా మీద సెలబ్రిటీలు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం. ఇక స్లో  నరేషన్ తో ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేస్తూ ముందుకు సాగడం అనేది చాలా మంచి విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని తెలుగు లో కనక చేసినట్లయితే ఈ సినిమాకి ఎవరు బాగా సెట్ అయ్యేవారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి.  నిజానికైతే కార్తీ చేసిన క్యారెక్టర్ కి నాని అలాగే అరవిందస్వామి చేసిన క్యారెక్టర్ కి రాజశేఖర్ అయితే బాగా సెట్ అయ్యేవారు అంటూ కొన్ని కామెంట్లైతే వస్తున్నాయి.
    ఇక వీళ్ళు చేసినట్లైతే ఈ సినిమా తెలుగులో ఇంకా మంచి విజయాన్ని సాధించేది అనేవారు కూడా ఉన్నారు. ఇక ఈ సినిమా ఆల్రెడీ డబ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ ఈ క్యారెక్టర్ ని రీప్లేస్ చేయాల్సి వస్తే మాత్రం వీళ్ళతో రీప్లేస్ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం.
    ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకున్న కార్తీ మంచి విజయాన్ని సాధించి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. నిజానికి సర్దార్ సినిమా తర్వాత ఆయనకి మంచి సక్సెస్ అయితే పడలేదు. మధ్యలో వచ్చిన సినిమాలన్నీ ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేదు.
    ఇక వచ్చిన సినిమాలు వచ్చినట్టు డిజాస్టర్ ని మూటగట్టుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు యూజ్ అయిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి తమ నటనతో మెప్పించడమే కాకుండా ప్రేక్షకులందరిని థియేటర్లో కూర్చోబెట్టారు అంటే ఆ కంటెంట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు..