https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ బర్త్ డే సందర్భంగా తన పెళ్లి వార్త చెప్పి ఫ్యాన్స్ కి సడన్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో అయితే ఇప్పటికే పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధిస్తూ నెంబర్ వన్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు... మరి ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చే సినిమాలకు ఇండియాలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది...

Written By: , Updated On : October 22, 2024 / 10:53 AM IST
Is Prabhas going to surprise his fans by telling the news of his marriage on his birthday?

Is Prabhas going to surprise his fans by telling the news of his marriage on his birthday?

Follow us on

Prabhas : యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఇక మీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ‘రాజాసాబ్’  సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.  దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు ఇందులో ప్రభాస్ ఒక హై ఎనర్జిటిక్ పాత్రలో నటించబోతున్నాడు అనేది చెప్పకనే చెప్పారు. మరి మొత్తానికైతే ఈనెల 23వ తేదీన ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఆయన బర్త్ డే ను పురస్కరించుకొని ప్రభాస్ కూడా అభిమానులకు ఒక భారీ సర్ ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే ప్రభాస్ కి సంబంధించిన పెళ్లి వ్యవహారాలను కూడా తన పెద్దమ్మ అయిన శ్యామలాదేవి తన బర్త్ డే సందర్భంగా రివీల్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక వచ్చే సంవత్సరం ప్రభాస్ పెళ్లి కూడా జరగబోతుంది అంటూ తన సన్నిహితుల నుంచి కూడా సమాచారం అయితే అందుతుంది. మరి దానికి తగ్గట్టుగానే ప్రభాస్ ఎలాంటి అప్డేట్ ని ఇస్తాడు మరి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన విషయాలు ఏమైనా చెబుతాడా లేదా అని ధోరణిలో కూడా ప్రస్తుతం ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రభాస్ తన పెళ్లి మీద మాత్రం అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి ఇప్పటికైనా ఒక భారీ అనౌన్స్ మెంట్ ని ఇచ్చి అభిమానులని ఆనందపరుస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఆయన బర్త్ డే వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం ప్రభాస్ భారీ సినిమాలను చేస్తూ  దిగ్గజ దర్శకులను లైన్ లో ఉంచాడు.
కాబట్టి తను ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతోనే స్టార్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తన అనుకున్నది నెరవేరుతుందా లేదా అనేది కూడా తెలియాలంటే తదుపరి ఆయన చేస్తున్న సినిమాల సక్సెస్ లను క్యాలిక్యూలేట్ చేయాల్సి ఉంటుంది…