Akira Nandan-Gautam Krishna : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఏపీ లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం అలాగే ఆయన లాంటి నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే తన కొడుకు అయిన అఖీరా నందన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక తొందర్లోనే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు లాంటి నటుడు తన దైన రీతిలో సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…
ఇక ఆయన ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఒక పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే మహేష్ బాబు మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న నేపధ్యంలో తన కొడుకు అయిన గౌతమ్ కృష్ణ తో మంచి సినిమాలు చేయించి అతన్ని ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేయాలని మహేష్ బాబు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అఖిరా నందన్ మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ హీరోగా ఎదుగుతారనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అయితే ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా వెలుగొందడమే కాకుండా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన లెగసీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…