Sai Pallavi: పురుషులందు పుణ్యపురుషులు వేరయా… అన్నట్లు హీరోయిన్స్ నందు సాయి పల్లవి వేరయా అని చెప్పాలి. నిజంగా ఆమె చాలా ప్రత్యేకం. యాక్టింగ్, డాన్స్ కి మించి ఆమె వ్యక్తిత్వం మోస్ట్ రెస్పెక్ట్ యాక్ట్రెస్ గా మార్చింది. డిమాండ్ ఉన్నప్పటికీ కోట్ల రెమ్యూనరేషన్ అడగదు. తన సిబ్బంది ఖర్చులు, వేతనాలు నిర్మాతలపై రుద్దకుండా తన రెమ్యూనరేషన్ నుండి చెల్లిస్తుంది. ఇక సినిమా పరాజయం పొందితే రెమ్యూనరేషన్ తిరిగి చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోట్లు కుమ్మరించినా, ఎంత పెద్ద స్టార్ అయినా పాత్రలో విషయం లేకపోతే నిర్మొహమాటంగా చేయనని చెప్పేస్తుంది. వ్యాపార ప్రకటనలకు దూరంగా ఉంటుంది. తాను నమ్మని విషయాన్ని ప్రచారం చేయనని చెబుతుంది.

ఈ జనరేషన్ హీరోయిన్స్ లో కనిపించని ఇన్ని ప్రత్యేకతలు సాయి పల్లవి సొంతం. అందుకే ఆమెను హీరోలు, స్టార్స్ కూడా అభిమానిస్తారు. సాయి పల్లవి ఫ్యాన్స్ లిస్ట్ లో ఓ స్టార్ హీరో కూడా ఉన్నారట. ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సందర్భంలో తెలియజేశారు. శర్వానందన్ హీరోగా తెరకెక్కిన చిత్రం పడి పడి లేచె మనసు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేడుకలో అల్లు అర్జున్ సాయి పల్లవిని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.
Also Read: Kamal Haasan On Vikram Box Office Success: విక్రమ్ డబ్బులతో నా అప్పులు తీర్చేస్తా… మిగతావి పంచేస్తా!
సాయి పల్లవి నటించిన మలయాళ చిత్రం ప్రేమమ్ చూశాను. తర్వాత తెలుగులో ఫిదా చూశాను. ఆమె గొప్ప యాక్ట్రెస్. అయితే ఆమెతో నేను సినిమా చేస్తే… సీన్ కంటే ముందు డాన్స్ చేయాలని నా కోరిక. సాయి పల్లవితో స్టెప్ వేయాలనే ఆశ నాలో ఎప్పటి నుండో ఉంది, అన్నారు. ఆయన ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సాయి పల్లవికి ఓ స్టార్ హీరో వీరాభిమాని, ఆ స్టార్ హీరో ఎవరో నేను చెప్పను, అన్నారు. చెప్పాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేసినా, ఎవరో అల్లు అర్జున్ చెప్పలేదు. దీంతో ఆ సస్పెన్సు అలానే ఉండి పోయింది.

కాగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విరాటపర్వం జూన్ 17న విడుదల కానుంది. హీరో రానా నక్సల్ రోల్ చేస్తుండగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా విరాటపర్వం చిత్రం తెరకెక్కింది. విరాటపర్వం ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ పీరియాడిక్ రెవల్యూషనరీ లవ్ డ్రామాలో ప్రియమణి సైతం కీలక రోల్ చేస్తున్నారు.
Also Read:RRR Movie- Larry Karaszewski: సినిమా చచ్చిపోయింది అనేవాళ్ళు RRR చూడండి అంటున్న హాలీవుడ్ రైటర్
Recommended Videos



[…] Also Read: Sai Pallavi: సాయి పల్లవి కి పెద్ద ఫ్యాన్ అయిన … […]
[…] Read:Sai Pallavi: సాయి పల్లవి కి పెద్ద ఫ్యాన్ అయిన … Recommended […]