Sai Pallavi-The Kashmir Files: సినిమా తారలు ఎప్పుడు వివాదాల్లోనే ఉంటారు. వారు ఏది చేసినా అది వివాదాస్పదంగానే ఉండటం గమనార్హం. కొందరు మాత్రం నోరు అదుపులో పెట్టుకుంటే కొందరు మాత్రం తమ ఇష్టానుసారం మాట్లాడుతూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో సాయిపల్లవి ఒకరు. ఆమె విరాటపర్వం సినిమాలో నటించింది. అది ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాపై అభిమానులకు కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా ఎట్టకేలకు విడుదల కావడానికి సిద్ధమైంది. దీంతో అందరి అంచనాలు ఆ సినిమాపై నే ఉన్నాయని తెలుస్తోంది.
ఫిదా సినిమాతో తెలుగు చిత్ర రంగానికి పరిచయమైన హీరోయిన్ సాయిపల్లవి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. డాన్సులతో అందరిని ఫిదా చేసింది.నటనతోనే కాదు తన మాటలతో కూడా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. గతంలో కశ్మీరీ పండిట్ల హత్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కశ్మీర్ ఫైల్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కొందరు విమర్శలు చేస్తుంటే మరికొందరు మాత్రం మద్దతు చెబుతున్నారు.
Also Read: Sai Pallavi: సాయి పల్లవి కి పెద్ద ఫ్యాన్ అయిన ఆ స్టార్ హీరో ఎవరు ?
కశ్మీరీ పండిట్ల ఉదంతంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అందరిలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మతం పేరుతో దాడులు చేయడాన్ని తప్పుబట్టడంపై ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సాయిపల్లవి యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఈ మాటలను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాయిపల్లవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలపర్వం కొనసాగుతోంది.
సాయిపల్లవి మాట్లాడిన దాంట్లో తప్పు లేదని కొందరు వాదిస్తున్నారు. వివాదాస్పదమైన అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో దూరడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి విషయాల్లో పలువురు తలదూర్చినా ఇప్పుడు మాత్రం సాయిపల్లవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణాలేంటని అభిమానులు అడుగుతున్నారు. సాయిపల్లవి ఇలాంటి వ్యవహారంలో వ్యాఖ్యానించి అభిమానుల ఆగ్రహానికి గురికావడం సంచలనం సృష్టిస్తోంది. విరాటపర్వం సినిమాను చూసేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాటపర్వం సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. దీంతో ఆమె వ్యాఖ్యల ప్రభావం సినిమాపై పడినట్లు తెలుస్తోంది. విరాటపర్వం సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వమని చెబుతున్నారు.
Also Read:Kamal Haasan On Vikram Box Office Success: విక్రమ్ డబ్బులతో నా అప్పులు తీర్చేస్తా… మిగతావి పంచేస్తా!