This Week Movie Releases: సినిమా ఇండస్ట్రీ లో ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో ఏ సినిమాలు విజయం సాధించాయో వాటికి మాత్రమే ఎక్కువ క్రేజ్ పెరుగుతోంది. ప్రేక్షకులు సైతం వాటిని చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో వాటి మధ్య భారీ పోటీ ఉంది. మరి ఈ మూడింటిలో ఏ సినిమా విజయం సాధించింది. ఏ సినిమా డీలాపడిపోయింది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ది గర్ల్ ఫ్రెండ్
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక మందన లీడ్ రోల్ లో నటించింది…ఇక ఈ సినిమా ఓకే అనిపించుకున్నప్పటికి రష్మిక మందాన క్రేజ్ తో ఈ సినిమా ముందుకు సాగుతుందనే చెప్పాలి. కంటెంట్ వైజ్ బాగున్నప్పటికి దానిని విజువల్ గా ప్రజెంట్ చేయడంలో రాహుల్ చాలావరకు సక్సెస్ అయ్యాడు. కానీ ఇంకాస్త బెటర్ గా ఉంటే సినిమా భారీ సక్సెస్ ని సాధించేది…
జటాధర
సుధీర్ బాబు హీరోగా వచ్చిన జటాధర సినిమా కూడా నిన్ననే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా పెద్దగా అంచనాలైతే లేవు… ఇక దానికి తోడుగా ఈ సినిమా కూడా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు…
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
తిరువీర్ హీరోగా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో… ఈ సినిమా సైతం నిన్న రిలీజ్ అయింది. శ్రీకాకుళం స్లాంగ్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద మొదట ప్రేక్షకుల్లో అంచనాలు లేకపోయినప్పటికి మొదటి షో తోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఇప్పుడు థియేటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నారు. అలాగే సినిమాకి మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. ఈ వీకెండ్ సినిమాని చూసి రిలాక్స్ అవ్వచ్చు అంటూ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు చెబుతుండడం విశేషం…
ఇక ఈ మూడు సినిమాల్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఓకే అనిపించుకున్నప్పటికి జటాధర సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ప్రీ వెడ్డింగ్ షో మూవీ మాత్రం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఈ వీకెండ్ విజేతగా నిలిచిందనే చెప్పాలి…