TDP Vs YCP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఒకరకమైన క్రమశిక్షణ ఉంది. అయితే అది క్రమశిక్షణ అనే కంటే మూర్ఖత్వం అనాలి. ఆ పార్టీ శ్రేణులకు చూసి రమ్మంటే కాల్చి వస్తారు. అధినేత బంగాళాఖాతంలో దూకం అంటే దూకుతారు. అంత పిచ్చి ఆ పార్టీ శ్రేణులది. అయితే అందులో చదువుకున్న మూర్ఖులే అధికం. వారే ఎక్కువగా అధినేతను గుడ్డిగా నమ్ముతారు. కనీసం సలహా ఇచ్చేందుకు కూడా సాహసించరు. కానీ అధినేత నుంచి ఆదేశం వచ్చిన వెంటనే ఆజ్ఞ ప్రభువు అంటూ శిరసా వహిస్తారు. కనీసం అది తప్పా? ఒప్పా? అన్నది చూడరు. అయితే అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్సు.. మైనస్ కూడా. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం అతి మేధావితనం అధికం. వారు ఎడాపెడా చంద్రబాబుకు సలహాలు ఇచ్చేస్తుంటారు. ముఖ్యంగా అనుకూల మీడియా అయితే.. చిలక పలుకులు చెబుతుంటారు. ఒకసారి కర్ర పెత్తనం చేయమంటారు.. మరోసారి అది తప్పు అని చెబుతారు.. పార్టీ కంట్రోల్లో లేదంటారు.. క్రమశిక్షణ పార్టీ అని పతాక శీర్షికన కథనాలు రాస్తుంటారు.
Also Read: ఇక విద్యార్థులే జగన్ నమ్మకమట!
* సలహాలు ఇచ్చే ముసుగులో..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి సలహాదారులుగా ఉండే మేధావులు మైనస్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెనుక ముందు చూసుకోకుండా అధినేత చెప్పిందే తడువుగా చేసేవారు తో ప్లస్సు. ఎంతలా అంటే 11 స్థానాలకు పరిమితం అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా దూకుడు ప్రదర్శిస్తుందంటే ఆ మూర్ఖత్వపు శ్రేణులే. ఎన్నికల ముందు తీసుకుందాం. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఒక నియోజకవర్గం అభ్యర్థిని వేరే నియోజకవర్గంలోకి పంపించారు. అది తమను బంగాళాఖాతంలో తోసేయడమేనని అభ్యర్థులకు తెలుసు. కానీ ఒక్కరంటే ఒక్కరు మీరు చేసింది తప్పు అని చెప్పలేదు. చివరకు అప్పట్లో మంత్రిగా ఉన్న చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణలాంటి వారు సైతం తమ అధినేత చెప్పిందే ఫైనల్ అంటూ తేల్చి చెప్పారు. ఆయన బంగాళాఖాతంలో దూకమన్న సిద్ధం అని చెప్పుకొచ్చారు. ఒక మంత్రిగా ఉన్న నేతకి అలా ఉంటే సామాన్య కార్యకర్తకు ఎలా ఉంటుందో తెలియంది కాదు. అయితే మూర్ఖత్వపు శ్రేణులు ఉన్న.. పార్టీని నడిపించే నాయకులు విసిగి వేసారి పోయారు. తమకంటే ఒలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో పార్టీలో పనిచేసే రే తప్ప 2019 మాదిరిగా గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఇలా పార్టీకి మైనస్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి.
* విపక్షానికి మించి..
అయితే తెలుగుదేశం పార్టీలో విచిత్ర పరిస్థితి ఉంది. శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరయింది. అప్పుడు చంద్రబాబు( CM Chandrababu) ప్రతిపక్ష పాత్ర పోషించాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగారు కొందరు మేధావులు. తమకున్న ప్రతిభను బయటపెట్టేసారు. మంత్రి పదవిగా ఛాన్స్ దక్కలేని కొందరు.. తమ అవకాశాలను వేరే వారు దక్కించుకున్నారని కొందరు.. ఇలా ఇచ్చి పడేశారు అసెంబ్లీలో. మంత్రులను నిలదీసినంత పని చేశారు. ఆపై టిడిపిలో మేధావులు ఎక్కువే. తమకు ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా.. రాజకీయపరమైన అంశాలు ఉన్న.. ఇట్టే రెచ్చిపోతారు. అధినేత చంద్రబాబు కంటే తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారమని భావిస్తారు.
* పెద్ద నేతలకు సైతం గౌరవం లేదు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతటి పెద్ద మేధావి నేత అయిన జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )దగ్గర తలదించుకుని ఉండాల్సిందే. చంద్రబాబు కుర్చీలు వేసి అందరినీ గౌరవిస్తున్నారు. కానీ వైసీపీ హయాంలో బొత్స లాంటి సీనియర్ మంత్రి అయినా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వయసు పైబడిన నేత అయినా.. కుర్చీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి పక్కనే కుర్చీ వేసే సాహసం కూడా ఎవరు చేయరు. అప్పట్లో ఎవరు మాట్లాడిన సందర్భం కూడా లేదు. కానీ చంద్రబాబు ఇప్పుడు అన్ని విధాల గౌరవం కల్పిస్తున్నారు. చాలా హుందాగా ఉంటున్నారు. అయినా సరే ఇంకా పెదవి విరుపులు.. ఆ పై ఉచిత సలహాలు. ఇది ముమ్మాటికి విచిత్ర రాజకీయమే.టిడిపికి మైనస్.. వైసీపీకి ప్లస్.. సింపుల్ గా అదే!
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఒకరకమైన క్రమశిక్షణ ఉంది. అయితే అది క్రమశిక్షణ అనే కంటే మూర్ఖత్వం అనాలి. ఆ పార్టీ శ్రేణులకు చూసి రమ్మంటే కాల్చి వస్తారు. అధినేత బంగాళాఖాతంలో దూకం అంటే దూకుతారు. అంత పిచ్చి ఆ పార్టీ శ్రేణులది. అయితే అందులో చదువుకున్న మూర్ఖులే అధికం. వారే ఎక్కువగా అధినేతను గుడ్డిగా నమ్ముతారు. కనీసం సలహా ఇచ్చేందుకు కూడా సాహసించరు. కానీ అధినేత నుంచి ఆదేశం వచ్చిన వెంటనే ఆజ్ఞ ప్రభువు అంటూ శిరసా వహిస్తారు. కనీసం అది తప్పా? ఒప్పా? అన్నది చూడరు. అయితే అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్సు.. మైనస్ కూడా. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం అతి మేధావితనం అధికం. వారు ఎడాపెడా చంద్రబాబుకు సలహాలు ఇచ్చేస్తుంటారు. ముఖ్యంగా అనుకూల మీడియా అయితే.. చిలక పలుకులు చెబుతుంటారు. ఒకసారి కర్ర పెత్తనం చేయమంటారు.. మరోసారి అది తప్పు అని చెబుతారు.. పార్టీ కంట్రోల్లో లేదంటారు.. క్రమశిక్షణ పార్టీ అని పతాక శీర్షికన కథనాలు రాస్తుంటారు.
* సలహాలు ఇచ్చే ముసుగులో..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి సలహాదారులుగా ఉండే మేధావులు మైనస్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెనుక ముందు చూసుకోకుండా అధినేత చెప్పిందే తడువుగా చేసేవారు తో ప్లస్సు. ఎంతలా అంటే 11 స్థానాలకు పరిమితం అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా దూకుడు ప్రదర్శిస్తుందంటే ఆ మూర్ఖత్వపు శ్రేణులే. ఎన్నికల ముందు తీసుకుందాం. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఒక నియోజకవర్గం అభ్యర్థిని వేరే నియోజకవర్గంలోకి పంపించారు. అది తమను బంగాళాఖాతంలో తోసేయడమేనని అభ్యర్థులకు తెలుసు. కానీ ఒక్కరంటే ఒక్కరు మీరు చేసింది తప్పు అని చెప్పలేదు. చివరకు అప్పట్లో మంత్రిగా ఉన్న చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణలాంటి వారు సైతం తమ అధినేత చెప్పిందే ఫైనల్ అంటూ తేల్చి చెప్పారు. ఆయన బంగాళాఖాతంలో దూకమన్న సిద్ధం అని చెప్పుకొచ్చారు. ఒక మంత్రిగా ఉన్న నేతకి అలా ఉంటే సామాన్య కార్యకర్తకు ఎలా ఉంటుందో తెలియంది కాదు. అయితే మూర్ఖత్వపు శ్రేణులు ఉన్న.. పార్టీని నడిపించే నాయకులు విసిగి వేసారి పోయారు. తమకంటే ఒలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో పార్టీలో పనిచేసే రే తప్ప 2019 మాదిరిగా గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఇలా పార్టీకి మైనస్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి.
* విపక్షానికి మించి..
అయితే తెలుగుదేశం పార్టీలో విచిత్ర పరిస్థితి ఉంది. శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరయింది. అప్పుడు చంద్రబాబు( CM Chandrababu) ప్రతిపక్ష పాత్ర పోషించాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగారు కొందరు మేధావులు. తమకున్న ప్రతిభను బయటపెట్టేసారు. మంత్రి పదవిగా ఛాన్స్ దక్కలేని కొందరు.. తమ అవకాశాలను వేరే వారు దక్కించుకున్నారని కొందరు.. ఇలా ఇచ్చి పడేశారు అసెంబ్లీలో. మంత్రులను నిలదీసినంత పని చేశారు. ఆపై టిడిపిలో మేధావులు ఎక్కువే. తమకు ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా.. రాజకీయపరమైన అంశాలు ఉన్న.. ఇట్టే రెచ్చిపోతారు. అధినేత చంద్రబాబు కంటే తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారమని భావిస్తారు.
* పెద్ద నేతలకు సైతం గౌరవం లేదు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతటి పెద్ద మేధావి నేత అయిన జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )దగ్గర తలదించుకుని ఉండాల్సిందే. చంద్రబాబు కుర్చీలు వేసి అందరినీ గౌరవిస్తున్నారు. కానీ వైసీపీ హయాంలో బొత్స లాంటి సీనియర్ మంత్రి అయినా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వయసు పైబడిన నేత అయినా.. కుర్చీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి పక్కనే కుర్చీ వేసే సాహసం కూడా ఎవరు చేయరు. అప్పట్లో ఎవరు మాట్లాడిన సందర్భం కూడా లేదు. కానీ చంద్రబాబు ఇప్పుడు అన్ని విధాల గౌరవం కల్పిస్తున్నారు. చాలా హుందాగా ఉంటున్నారు. అయినా సరే ఇంకా పెదవి విరుపులు.. ఆ పై ఉచిత సలహాలు. ఇది ముమ్మాటికి విచిత్ర రాజకీయమే