https://oktelugu.com/

కొత్తదనం లేని ‘బిగ్ బాస్’ షో.. తొలిరోజే మిక్స్ డ్ టాక్..!

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ రియల్టీ షో ఆదివారం ప్రారంభమైంది. బిగ్ బాస్ మూడో సీజన్ కు హోస్టుగా చేసిన కింగ్ నాగార్జునే ‘బిగ్ బాస్-4’కు కూడా చేస్తున్నాడు. ఈ నాలుగో సీజన్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోగా తొలి షో చూసిన వారికి కొంత నిరాశ ఎదురైనట్లు కన్పిస్తోంది. బిగ్ బాస్ నిర్వహకులు పాతఫార్మూలానే కొత్తగా చూపించే యత్నం చేస్తున్నారని.. కొత్తదనం లేకుండాపోయిందనే టాక్ ప్రేక్షకుల నుంచి విన్పిస్తోంది. కొద్దిరోజులుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2020 / 01:08 PM IST

    Nagarjuna

    Follow us on

    బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ రియల్టీ షో ఆదివారం ప్రారంభమైంది. బిగ్ బాస్ మూడో సీజన్ కు హోస్టుగా చేసిన కింగ్ నాగార్జునే ‘బిగ్ బాస్-4’కు కూడా చేస్తున్నాడు. ఈ నాలుగో సీజన్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోగా తొలి షో చూసిన వారికి కొంత నిరాశ ఎదురైనట్లు కన్పిస్తోంది. బిగ్ బాస్ నిర్వహకులు పాతఫార్మూలానే కొత్తగా చూపించే యత్నం చేస్తున్నారని.. కొత్తదనం లేకుండాపోయిందనే టాక్ ప్రేక్షకుల నుంచి విన్పిస్తోంది.

    కొద్దిరోజులుగా బిగ్ కంటెస్టులు, హోస్టు గురించి వస్తున్న వార్తలే నిజమమయ్యాయి. ఒకరిద్దరు మినహా అందరూ కంటెస్టుల గురించి ప్రేక్షకులకు తెల్సిపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి లేకుండా పోయింది. కిందటి సీజన్లో ఏవిధంగానైతే వివిధ రంగాలకు చెందిన వారికి కంటెస్టులుగా పరిచయం చేశారో అదేతరహాలోనే చూపించారు. నాగర్జున హోస్టింగ్ సైతం పాత తరహాలోనే ఉండటంతో ‘బిగ్ బాస్-4’పై ప్రేక్షకుల్లో మిక్స్ డ్ టాక్ వ్యక్తమైంది.

    ‘బిగ్ బాస్-4’లో కంటెస్టులందరు కూడా సేమ్ టూ సేమ్ ‘బిగ్ బాస్-3’ని పోలిన వారిని తీసుకొచ్చారు. గత సీజన్లో తెలంగాణ యాసలో తీన్మార్ యాంకర్ శివజ్యోతి రాగా ప్రస్తుతం ఆ కేటగిరి నుంచి జోర్దార్ సుజాత వచ్చింది. గతంలో టీవీ 9 నుంచి జాఫర్, దీప్తి సునైనా రాగా ప్రస్తుతం దీప్తి నాగవెల్లి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియా నుంచి గతంలో మహేష్ విట్టా, ఆశురెడ్డిలు రాగా ప్రస్తుతం దేత్తడి హరీక వచ్చింది. గతంలో డ్యాన్స్ మాస్టర్ గా బాబా భాస్కర్ రాగా ఈసారి అమ్మ రాజశేఖర్ వచ్చారు. దాదాపు ఈ సీజన్లోని కంటెస్టులంతా బిగ్ బాస్-3ని తలపించేలా కన్పించారు.

    హీరోయిన్ మోనాల్ గజ్జర్ ‘బిగ్ బాస్-4’లో తొలి కంటెస్టుగా ఎంట్రీ ఇచ్చి షోపై అంచనాలు పెంచింది. ఇక వరుసగా దర్శకుడు సూర్యకిరణ్, యాంకర్ లాస్య, నటుడు అభిజిత్, జోర్దార్ సుజాత, మెహబూబ్, దేవి, దేత్తడి హారిక, ఇస్మార్ట్ సోహెల్, అరియానా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, సింగర్ నోయల్, మోడల్ దివి, అఖిల్ సర్తక్, గంగవ్వలు ఎంట్రీ ఇచ్చారు.

     
    వయస్సు రీత్య పెద్దదైన గంగవ్వ ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే బిగ్ బాస్ విధించే టాస్కుల్లో ఆమె ఏమేరకు ఆకట్టుకుంటుందనే సందేహాలు కలుగుతున్నాయి. బిగ్ బాస్-4 షో తొలిరోజే మిక్స్ డ్ టాక్ తో తెచ్చుకున్నప్పటికీ రానున్న రోజుల్లో ఆకట్టుకోవడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. దీంతో బిగ్ బాస్ రానున్న రోజుల్లో ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో వేచిచూడాల్సిందే..!