వి’ ప్లాపును దిల్ రాజు ముందే ఊహించరా?

నిర్మాత దిల్ రాజు ‘వి’ మూవీని సేఫ్ గా డీల్ చేయడంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమాలపై దిల్ రాజు తీసుకునే జడ్జిమెంట్ కరెక్టేనని ‘వి’తో మరోసారి రుజువు చేశాడు. నాని-సుధీర్ బాబులతో భారీ బడ్జెట్లో ‘వి’ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. థియేటర్లలో రిలీజు కావాల్సిన ఈ సినిమాను దిల్ రాజు ఓటీటీలో రిలీజు చేయడంపై పలువురు పెదవి విరిచారు. అయితే ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్టేనని ఆ తర్వాత తేలిపోయింది. ‘వి’ మూవీని […]

Written By: NARESH, Updated On : September 7, 2020 1:14 pm
Follow us on

నిర్మాత దిల్ రాజు ‘వి’ మూవీని సేఫ్ గా డీల్ చేయడంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమాలపై దిల్ రాజు తీసుకునే జడ్జిమెంట్ కరెక్టేనని ‘వి’తో మరోసారి రుజువు చేశాడు. నాని-సుధీర్ బాబులతో భారీ బడ్జెట్లో ‘వి’ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. థియేటర్లలో రిలీజు కావాల్సిన ఈ సినిమాను దిల్ రాజు ఓటీటీలో రిలీజు చేయడంపై పలువురు పెదవి విరిచారు. అయితే ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్టేనని ఆ తర్వాత తేలిపోయింది.

‘వి’ మూవీని దిల్ రాజు ఓటీటీలో విడుదల చేస్తున్నారనే ప్రకటనే రాగానే టాలీవుడ్లోని ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీని ఓటీటీలో దిల్ రాజు రిలీజు చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. సినిమాపై ఆయనకు ఉన్న జడ్జిమెంట్ ఆయనను నేడు నష్టపోకుండా కాపాడిందనే టాక్ విన్పిస్తుంది. ‘వి’ విషయంలో దిల్ రాజు ఆచితుచి వ్యవహరించారు. అమెజాన్ ప్రైమ్లో మంచి ధరకు రాగానే ‘వి’ ఓటీటీలో రిలీజ్ చేశాడు.

‘వి’ మూవీని తొలి నుంచి థియేటర్లలో రిలీజు చేసేందుకే చిత్రయూనిట్ మొగ్గుచూపింది. ‘వి’కి నిర్మాత అయిన దిల్ రాజుకు డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోని వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. థియేటర్లు ఓపెన్ కాగానే తొలి సినిమాగా ఈ సినిమా వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అనుహ్యంగా దిల్ రాజు ఓటీటీ వైపు మొగ్గుచూపడం ఆయన తెలివితేటలకు నిదర్శంగా కన్పిస్తున్నాయి.

‘వి’ సినిమా థియేటర్లలో విడుదలైతే ఖచ్చితంగా ప్లాప్ టాక్ తెచ్చుకునేది. దీనిని ముందుగానే గుర్తించిన దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ నుంచి తనకు నష్టంలేని డీల్ వచ్చిన వెంటనే ఓటీటీ వైపే మొగ్గుచూపారు. హీరోలు, దర్శకులతో మాట్లాడి సినిమాను ఓటీటీ రిలీజ్ చేసేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సినిమా ప్లాప్ టాక్ వస్తే నష్టాలు భారీగా వచ్చే ప్రమాదం ఉంది. దీనిని ముందుగానే ఊహించిన దిల్ రాజు సేఫ్ గా ఓటీటీలో రిలీజ్ చేశాడు. ‘వి’ మూవీని ఎలాంటి నష్టం లేకుండా దిల్ రాజు తెలివిగా వదిలించుకున్నాడనే టాక్ విన్పిస్తోంది.