Mahesh Babu: 1999 వ సంవత్సరంలో ‘రాజకుమారుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటుడు మహేష్ బాబు… మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ సినిమాను చూసిన చాలా మంది కృష్ణ నట వారసుడు స్టార్ హీరోగా మారబోతున్నాడు అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబుకి అనుకున్నంత సక్సెసులైతే దక్కలేదు.ఇక అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి లాంటి వరుస సక్సెస్ లను సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్ టాప్ లెవెల్ కి వెళ్లిపోయాడు. ఇక మహేష్ బాబు మాత్రం నేను ఎంత మంచి సినిమాలు చేసిన సక్సెస్ లు సాధించడం లేదు అనే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళాడట. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వరుస సక్సెస్ లను సాధించడం చూసిన మహేష్ బాబుకి చెమటలు పట్టాయని చాలా మంది చెబుతుంటారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ డాన్సులు బాగా వేస్తాడు, మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
కాబట్టి తనను బీట్ చేయడం చాలా కష్టమని మహేష్ బాబు అనుకున్నారట. కానీ మొత్తానికైతే ఒక్కడు, అతడు, పోకిరి లాంటి వరుస సినిమాలతో మహేష్ బాబు సైతం ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయడమే కాకుండా అప్పుడున్న స్టార్ హీరోలు అందరిని వెనక్కి నెట్టి తను టాప్ లెవెల్ కి వెళ్లడం అనేది మహేష్ బాబు అభిమానులందరిని ఆకర్షించింది…
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం మహేష్ బాబు టాప్ 6 హీరోల్లో ఒకరిగా నిలవడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది. ఈ సినిమాలో తను 5 డిఫరెంట్ క్యారెక్టర్ లను పోషిస్తున్నాడు. ఒక్కో క్యారెక్టర్ లో తను చూపించే వేరియేషన్ అద్భుతంగా ఉంటుందని రాజమౌళి చెబుతున్నాడు.
మరి ఆ క్యారెక్టర్ లో ఆయన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటే మాత్రం మహేష్ బాబు టాప్ లెవెల్ కి వెళ్లిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి మహేష్ బాబు చాలా మంచి నటుడు కానీ తను నట పోటెన్షయాలిటీ ని బయటికి తీసే సినిమాలు మాత్రం ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పాలి.ఇక వారణాసి సినిమా ఆ లోటును భర్తీ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…