Chiranjeevi: చిరంజీవి తర్వాత ఆ ప్రతిభ ఏ హీరోకు సొంతం అంటే?

సినిమాల్లో సుమన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1980 నుంచి 1990లో సుమన్ హీరోగా వరుస హిట్లు కొట్టాడు. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యారు. ఆ తరువాత మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. దేవుళ్ల పాత్రలతో రెండో ఇన్నింగ్స్ లో సుమన్ ఫేమస్ అయ్యారు.

Written By: Chai Muchhata, Updated On : April 27, 2023 3:03 pm
Follow us on

Chiranjeevi: సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోలు చేసే కామెంట్లు పేలుతూ ఉంటాయి. ముఖ్యంగా వైరం ఉన్న ఇద్దరు హీరోల మధ్య చిన్న మాట అయినా పెద్ద వివాదంగా మారుతుంది. అప్పట్లో చిరంజీవి, సుమన్ ల మధ్య కొన్ని వివాదాలున్నాయని, వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉందని ప్రచారం చేశారు. అది ఎంతవరకు నిజమో కానీ, వీరిద్దరు అయితే ఏ సినిమాల్లో కలిసి నటించలేదు. కనీసం ఒకే వేదికపై కనిపించలేదు. అయితే చాలా రోజుల తరువాత సుమన్ లేటేస్టుగా చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సినిమాల్లో సుమన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1980 నుంచి 1990లో సుమన్ హీరోగా వరుస హిట్లు కొట్టాడు. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యారు. ఆ తరువాత మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. దేవుళ్ల పాత్రలతో రెండో ఇన్నింగ్స్ లో సుమన్ ఫేమస్ అయ్యారు. ఆ తరువాత రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ చిత్రంలో విలన్ గా నటించి మెప్పించారు. మొత్తంగా తన సినీ కెరీర్లో బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నారు సుమన్.

అయితే ఈయన తాజాగా చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవి తరువాత అంతటి రేంజ్ లో డ్యాన్స్ చేసే వ్యక్తి ఆ హీరోనే అని అన్నారు. ఒకప్పుడు చిరంజీవి డ్యాన్స్ అంటే చాలా మంద హీరోయిన్లు భయపడేవారు. జయమాలిని లాంటి వారే చిరంజీవి డ్యాన్స్ ను తట్టుకోలేకపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మెగాస్టార్ రేంజ్ లో డ్యాన్స్ చేసే వారు ఇండస్ట్రీలో లేరని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. కానీ సుమన్ ఒక్కసారిగా చిరంజీవి తరువాత అలాంటి డ్యాన్స్ చేసే మరో హీరో ఉన్నాడని చెప్పడం ఆసక్తిగా మారింది.

ఇంతకీ ఆ హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అట. సుమన్ కు జూనియర్ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని చెబుతున్నారు. అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఆ యంగ్ హీరోను సుమన్ తెగ పొగిడేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, సుమన్ కలిసి ‘నా అల్లుడు’ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి జూనియర్ నటనపై ఆసక్తి పెరిగిందని సుమన్ చెప్పడం విశేషం. సుమన్ చేసిన ఈ వ్యాక్యలు ఇండస్ట్రీలో ఆసక్తిగా మారాయి.