https://oktelugu.com/

క్రాక్‌ సినిమా టీం ఆలోచన సక్సెస్‌ తెచ్చిపెట్టేనా

సంక్రాంతి పండుగ వచ్చిందంటే టాలీవుడ్‌లో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. సినిమాలు రిలీజ్‌ చేసేందుకు పోటీ పడుతుంటారు. ఒకవైపు పందెం కోళ్ల ఆటలు.. మరోవైపు థియేటర్లలో సినిమాల ఆటలు.. వెరసి ప్రజలందరికీ పండుగే పండుగ. కానీ.. కరోనా వైరస్‌తో థియేటర్లన్నీ బోసిపోయాయి. కానీ.. రవితేజ యాక్టర్‌‌గా నిర్మించిన క్రాక్‌ సినిమా ఓ కొత్త ప్రయోగానికి తెరలేపుతోంది. Also Read: గర్భవతిని అని కూడా చూడకుండా వేధించారు! పండక్కి వారం ముందు రిలీజ్‍ చేసి సక్సెస్‍ అయిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 4, 2021 / 02:20 PM IST
    Follow us on


    సంక్రాంతి పండుగ వచ్చిందంటే టాలీవుడ్‌లో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. సినిమాలు రిలీజ్‌ చేసేందుకు పోటీ పడుతుంటారు. ఒకవైపు పందెం కోళ్ల ఆటలు.. మరోవైపు థియేటర్లలో సినిమాల ఆటలు.. వెరసి ప్రజలందరికీ పండుగే పండుగ. కానీ.. కరోనా వైరస్‌తో థియేటర్లన్నీ బోసిపోయాయి. కానీ.. రవితేజ యాక్టర్‌‌గా నిర్మించిన క్రాక్‌ సినిమా ఓ కొత్త ప్రయోగానికి తెరలేపుతోంది.

    Also Read: గర్భవతిని అని కూడా చూడకుండా వేధించారు!

    పండక్కి వారం ముందు రిలీజ్‍ చేసి సక్సెస్‍ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు కరోనా నేపథ్యంలో సగం మాత్రమే టికెట్లు విక్రయించాలని రూల్స్‌ ఉన్నాయి. దీంతో రిలీజ్‌ డేట్‌ను ముందుకుతీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. శని, ఆదివారాలలో ఆడియన్స్ సినిమాలకు బాగా వస్తున్నారని ‘సోలో బ్రతుకే సో బెటర్‍’ విషయంలో రుజువయింది. దీంతో ఆ అడ్వాంటేజ్‍ పోగొట్టుకోకుండా క్రాక్‍ సినిమాను జనవరి 9నే విడుదల చేయాలని డిసైడ్‌ అయ్యారు. దీని వల్ల సంక్రాంతికి ఒక రోజు ఎడంతో విడుదలవుతున్న సినిమాల నుంచి డైరెక్ట్ పోటీని తప్పించుకున్నట్టయింది.

    Also Read: క్రేజీ బ్యూటీకి బ్యాడ్ టైమ్.. ఎవ్వరూ పట్టించుకోవట్లేదట !

    రవితేజ పూర్తిగా మాస్‌ హీరో. క్రాక్‌ సినిమా కూడా మాస్‌ మసాలా లాంటి సినిమానే. అందుకే.. దీనిని ఓటిటిపై రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ సినిమాపై నమ్మకంతో కరోనా సమయంలో కూడా బయ్యర్లు వెనక్కి తగ్గలేదు. మాస్ కథ కావడంతో తప్పకుండా ప్రేక్షకులు అలరిస్తారని నమ్మకంతో ఉన్నారు. రిస్క్ ఫ్యాక్టర్‍ ఉన్నప్పటికీ ఇది సూపర్‍ ప్లాన్‍ అనే ట్రేడ్‍ కూడా ట్రెండింగ్‌ అవుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్