Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదైంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను ఆయన మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే కొన్ని అసభ్యకర పోస్ట్స్ పెట్టారు. ఈ కేసులో వర్మకు పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ తన టీమ్ తో హైదరాబాద్ వచ్చారు. వర్మను అరెస్ట్ చేసేందుకు నవంబర్ 25న ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే వర్మ ఇంట్లో లేడని సిబ్బంది చెప్పడంతో హైడ్రామా నెలకొంది.
అరెస్ట్ నుండి తప్పుకునేందనుకు వర్మ కోర్టులో పిటీషన్స్ దాఖలు చేశాడు. కానీ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అరెస్ట్ ని ఆపలేమని కోర్టు వెల్లడించినట్లు సమాచారం. ఇక వర్మ కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. శంషాబాద్ ఫార్మ్ హౌస్లో ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లారు. అక్కడ కూడా వర్మ కనిపించలేదు. కాగా వర్మ లాయర్ టీమ్ పోలీసులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. నేరుగా వర్మ విచారణకు హాజరు కాలేరు. వర్చువల్ గా హాజరు పరుస్తామని, అందుకు లీగల్ గా వర్మకు వెసులుబాటు ఉందని చెప్పినట్లు సమాచారం.
వర్మ ఎక్కడున్నాడు అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన కోసం పోలీసులు గాలింపు చేస్తున్నట్లు సమాచారం. కాగా వర్మ గతంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు వ్యక్తిత్వాలను దెబ్బతీసేలా సినిమాలు కూడా చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడిని విలన్ గా ఆయన చూపించారు. ఎన్టీఆర్ పై బాబు కుట్ర చేశాడనే కోణంలో ఆ మూవీ సాగుతుంది.
అలాగే పవర్ స్టార్ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ లను కించపరిచేలా సన్నివేశాలు, సాంగ్స్, డైలాగ్స్ రూపొందించారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టగా వర్మ పై చర్యలకు సిద్ధమయ్యారు. వర్మను ఎలా అయినా అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు దేశం మెచ్చిన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. ఆయన సినిమాలు ఇండియా వైడ్ సంచలనం రేపాయి. కొన్నాళ్లుగా ఆయన కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ ఆధారంగా సినిమాలు చేస్తున్నారు..