Site icon OkTelugu

Pushpa 2 : పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడ లో నిర్వహిస్తున్నారా..? అసలు ఈ ఈవెంట్ ఎప్పుడు జరుగుతోంది..?

Pushpa 2 pre release event is being held at Yusuf Guda..? When is this event actually happening..?

Pushpa 2 pre release event is being held at Yusuf Guda..? When is this event actually happening..?

Pushpa 2 : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు స్టార్ హీరోలుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రయత్నం చేయడంలో తప్పులేదు కానీ దానికి తగిన రేంజ్ లో కష్టపడుతూ ముందుకు సాగితే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. లేకపోతే మాత్రం వాళ్లు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వడం చాలా కష్టతరం అవుతుందనే చెప్పాలి…

ప్రస్తుతం భారీ హైప్ ను క్రియేట్ చేసుకున్న సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటి… తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయనతో పాటు సినిమా దర్శకుడు అయిన సుకుమార్ కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొత్తం ఫినిష్ చేసుకున్న ఈ సినిమా మరో పది రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో భారీగా నిర్వహించాలనే ప్లాన్ లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా చెన్నైలో ఈ సినిమా కి సంభందించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ‘పుష్ప వైల్డ్ ఫైర్’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది.

ఇక దానికి ఏమాత్రం తీసిపోకుండా తెలుగులో కూడా అలాంటి ఒక ఈవెంట్ ను కండక్ట్ చేయాలని సినిమా యూనిట్ అనుకుంటుంది. మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ ఈవెంట్ భారీ రేంజ్ లో జరపాలి అంటే దానికి యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ అయితే బాగుంటుందని సినిమా మేకర్స్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ ఈవెంట్లో చాలామంది అల్లు అర్జున్ అభిమానులు పాల్గొనబోతున్నారు కాబట్టి వాళ్లందరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి పోలీస్ గ్రౌండ్స్ ను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న వాటిలో పోలీస్ గ్రౌండ్స్ అయితేనే బెస్ట్ పలువురు సినీ మేధావులు సైతం భావిస్తున్నారు. ఇక ఇంతకుముందు దీంట్లో పలు రకాల సినిమా ఈవెంట్లు కూడా జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం ఆ గ్రౌండ్ నే ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈనెల 29వ తేదీన గాని, లేదంటే 30వ తేదీన గాని ఈ ఈవెంట్ ను జరిపే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం అల్లు అర్జున్ క్రేజ్ అనేది తారాస్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇక అదే విధంగా వీళ్ల క్రేజ్ ను ఆపడం ఎవ్వరి వల్ల అవ్వదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే నార్త్ లో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని అక్కడ చాలా వైల్డ్ గా రిలీజ్ చేయాలనే ప్రణాళికలో సినిమా మేకర్స్ అయితే ఉన్నారు…

Exit mobile version