Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతుంది. డిఫరెంట్ కథలతో సినిమాలు చేయడమే కాకుండా ప్రేక్షకులను మెప్పించే సినిమాలను సైతం చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మన దర్శకులందరు వాళ్ళను వాళ్ళు స్టాక్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు…
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ సైతం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక గత కొన్ని సినిమాల నుంచి అల్లు అర్జున్ పెద్దగా డ్యాన్స్ లు అయితే చేయడం లేదు. కానీ పుష్ప 2 సినిమాలో డాన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని పాటలను పెట్టించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా అనేది ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముడ్నుకు వస్తుంది… ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఇక మొత్తానికైతే అన్ని సాంగ్స్ ఆయన చేతే చేయించుకున్న సుకుమార్ బిజిఎం మాత్రం తమన్ చేత కంపోజ్ చేయిస్తున్నట్టుగా తెలూస్తోంది. ఇక దానికి కారణం ఏంటి అంటే సుకుమార్ తీసిన సీన్లకు తగ్గట్టుగా దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించలేకపోతున్నాడట. దానివల్ల సీన్లు ఎలివేట్ అవ్వడం లేదనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ కావాలని తమన్ ను పిలిపించుకొని అతని చేత బిజిఎం ని కొట్టించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనివల్ల దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ మీద భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఆల్రెడీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు అతన్ని కాదని బిజిఎం కోసం మరొక మ్యూజిక్ డైరెక్టర్ ని పిలిపించుకుంటే మంచి మ్యూజిక్ ఇవ్వడం ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ వల్ల అవ్వడం లేదనే విషయం సినిమా ఇండస్ట్రీ అంతా పాకుతుంది. కాబట్టి అతనికి వచ్చే అవకాశాలు కూడా రాకుండా పోతాయి.
మరి ఇలాంటి సందర్భంలో సుకుమార్ ఎందుకు ఇలా చేశాడంటూ కొంతమంది సుకుమార్ ను తప్పు పడుతుంటే సుకుమార్ మాత్రం సినిమా బాగుండాలని సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న రోల్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండడం వల్ల హిట్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
కాబట్టి అతను కూడా అదే స్ట్రాటజీని మెయిటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ బిజిఎం కనక సరిగ్గా లేకపోతే సినిమాలో సీన్ అనేది అంత బాగా ఎలివేట్ అవ్వదు. దాని వల్ల ప్రేక్షకుల్లో ఎలాంటి ఫీల్ ఏర్పడదు. కాబట్టి సుకుమార్ ఈ సినిమా కోసం తమన్ చేత బిజిఎం ను కొట్టిస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ అనుసరించే ఫార్మాట్ అయితే బాగానే ఉంది. ఒకరి నుంచి ది బెస్ట్ అవుట్ పుట్ రానప్పుడు మరొకరిని పిలిపించుకొని ఆయన చేత మ్యూజిక్ ను రాబట్టుకోవడం అనేది మంచి పద్దతే అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…