Koratala Siva: కెరియర్ స్టార్టింగ్ లో చాలా గొప్ప సినిమాలను చేస్తూ తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ‘మిర్చి’ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు ‘కొరటాల శివ’… ఆ తర్వాత స్టార్ హీరోలందరితో సినిమాలను చేస్తూ వచ్చాడు… కమర్షియల్ సినిమాల్లో ఒక సోషల్ మెసేజ్ ని ఇవ్వడం అనేది అతని స్టైల్… ఇక ప్రతి సినిమాలో ఒక మెసేజ్ అయితే ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి సినిమాలను చేశాడు. ఇక భరత్ అను నేను సినిమాతో సైతం మహేష్ బాబులో ఉన్న గొప్ప నటుడిని బయటికి తీసి అతన్ని స్టార్ హీరో గా ప్రాజెక్ట్ చేశాడు.
ఇక చిరంజీవితో ఎప్పుడైతే ‘ఆచార్య’ సినిమా చేశాడో అప్పటి నుంచి అతని డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి భారీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది.
దాంతో ఇప్పుడు ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో కొంతవరకు సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. దేవర 2 సినిమా ఉంటుందంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చినప్పటికి ప్రస్తుతం ఆ సినిమాని పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. దాంతో కొద్దిరోజుల నుంచి కొరటాల శివ బయట ఎక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు.
గతంలో నాగచైతన్యతో ఒక సినిమా చేయబోతున్నాడంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికి అందులో ఎంతవరకు నిజం లేదంటూ మరి కొంతమంది దానిని ఖండించారు. ఇక ఇప్పుడు అతనికి అవకాశం ఇచ్చే టైర్ వన్ హీరోలెవరు లేరు. కాబట్టి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను చేసి మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక తొందర్లోనే ఆయన తన సినిమాని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం అతన్ని ప్రేక్షకులందరు మరిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…