Homeఅంతర్జాతీయంIran protest crackdown: ఇరాన్‌ నిరసనలపై ఉక్కుపాదం.. అధికారికంగా 3 వేలు, వాస్తవంగా 30 వేల...

Iran protest crackdown: ఇరాన్‌ నిరసనలపై ఉక్కుపాదం.. అధికారికంగా 3 వేలు, వాస్తవంగా 30 వేల మంది మృతి!

Iran protest crackdown: ఇరాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. సమాన్యుడు బతకలేని పరిస్థితులు తలెత్తాయి. దీంతో ధరలు తగ్గించాలని ప్రజలు రోడ్డపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నిరసనకారులకు అమెరికా మద్దతు తెలిపింది. దీంతో మరింత రెచ్చిపోయారు. అయితే సుప్రీం లీడర్‌ ఖమేనీ ఈ నిరసనలపై ఉక్కుపాదం మోపారు. పోలీసులతో దాడులు చేయించారు. కాల్పులు జరిపించారు. దీంతో వేల మంది మరణించారు.

ఆ రెండు రోజుల్లో..
ఇరాన్‌లో జనవరి 8, 9 తేదీల్లో జరిగిన నిరసనల్లో మరణాల సంఖ్య భారీగా ఎక్కువగా ఉందని టైం మ్యాగజైన్‌ నివేదించింది. ప్రభుత్వం పేర్కొన్న 3,117 మరణాలతో పోలిస్తే, వాస్తవ మరణాలు 30 వేలకుపైగా ఉంటాయని తెలిపింది. ఇంటర్నెట్‌ నిలిపివేయడంతో ఈ సమాచారం బయటకు రాలేదని వెల్లడించింది.

నివేదిక వివరాలు
టైం స్థానిక అధికారులు, వైద్యులు, ఆసుపత్రి డాక్యుమెంట్ల ఆధారంగా ఈ అంచనాను వెల్లడించింది. సుమారు 4 వేల ప్రాంతాల్లో వ్యాపించిన అల్లర్లు దేశవ్యాప్తంగా మారాయి. అధికారిక లెక్కలు వాస్తవాన్ని తగ్గించి చూపించాయని నివేదిక పేర్కొంది.

ప్రభుత్వ చర్యలు
ఖమేనీ ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా సస్పెండ్‌ చేయడం వల్ల బాహ్య ప్రపంచానికి నిజాలు చేరలేదు. ఈ నిర్బంధం సమాచార ప్రవాహాన్ని అడ్డుకుని, అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించింది. స్థానిక మూలాలు మాత్రమే వాస్తవాలను బయటపెట్టాయి.

అధికారిక లెక్కలు తక్కువ చూపడం ద్వారా ప్రభుత్వం దేశీయ, విదేశీ అభిప్రాయాలను నియంత్రించాలని ప్రయత్నిస్తోంది. ఇంటర్నెట్‌ బ్లాక్‌తో వాస్తవాలు వెలుగులోకి రాలేదు. ఇది ఇరాన్‌ స్థిరత్వానికి ముప్పుగా మారవచ్చు. అంతర్జాతీయ శిక్షలకు దారితీయవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular