Sukumar and Devi Sri Prasad : దాదాపు 25 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూ వస్తున్న దేవి శ్రీ ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఆల్బమ్ సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా సినిమా సక్సెస్ లో కూడా ఆయన మ్యూజిక్ కీలకపాత్ర వహిస్తూ వస్తుంది.
ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్… ఇక మొదటిసారి ‘పుష్ప 2’ సినిమా పరంగా కొంతవరకు అవమానాన్ని కూడా మూటగట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ మొత్తాన్ని తనే కంపోజ్ చేసినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం దేవి ఇచ్చిన బిజీఎం కి సుకుమార్ అంతా సాటిస్ఫై అవ్వడం లేదట. దాంతో తమన్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకొని అతని చేత బిజిఎం ని కొట్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి కారణం దేవిశ్రీప్రసాద్ ఫెయిల్యూర్ అవ్వడమే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం దేవి శ్రీ ప్రసాద్ బిజిఎం అంతా గొప్పగా ఇవ్వడం లేదు. దాని వల్ల తమన్ ను తీసుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దేవిశ్రీప్రసాద్ సుకుమార్ మధ్య కొంతవరకు గ్యాప్ అయితే ఏర్పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సుకుమార్ మొదటి సినిమా నుంచి పుష్ప 2 సినిమా వరకు అన్ని సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో కూడా కుదిరింది. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ మధ్య ఎందుకు ఈ విభేదాలు వస్తున్నాయి అంటే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఇలాంటి విభేదాలు తరచుగా వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని సుకుమార్ గానీ దేవీ శ్రీ ప్రసాద్ గానీ పర్సనల్ గా తీసుకుంటే మాత్రం ఇద్దరి సినిమా కెరియర్లకు ఇబ్బంది అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి సినిమా వరకే తీసుకొని పర్సనల్ లైఫ్ లో బాగుంటే వీళ్ళిద్దరి కాంబోలో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అలా కాకుండా ఈగో లకి పోయి ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది చెడిపోయి ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు వచ్చే అవకాశాలు కూడా లేకుండా పోవచ్చు. కాబట్టి దేవిశ్రీప్రసాద్ ఈ సమయంలో సంయమనం పాటించడం చాలా మంచిదని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదోవ తేదీన రిలీజ్ అయి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను సాధించడానికి రెడీ అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు సినిమా సక్సెస్ ని కోరుకోవాలి. సినిమా సక్సెస్ అయితే ఎవరికి రావాల్సిన క్రెడిట్ వాళ్ళకి వస్తుందని చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…