https://oktelugu.com/

Pawan Kalyan- Surender Reddy: పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబో ఫిక్స్ షూటింగ్ ఎప్పుడంటే..?

నితిన్ హీరోగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ అయిన వక్కంతం వంశీ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా కాంబినేషన్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను తను సిద్ధం చేస్తున్నట్టుగా చిన్న హింటిచ్చాడు.

Written By: , Updated On : December 7, 2023 / 04:32 PM IST
Pawan Kalyan- Surender Reddy

Pawan Kalyan- Surender Reddy

Follow us on

Pawan Kalyan- Surender Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకోవదమే కాకుండా తనదైన రీతిలో మంచి సినిమాలు తీస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జనసేన పార్టీ మీటింగ్స్ లో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నాడు. ఎందుకంటే ఇంకొక 5 నెలల్లో ఏపిలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో తను షూటింగ్స్ అన్నింటికీ బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్నాడు…

ఇక నితిన్ హీరోగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ అయిన వక్కంతం వంశీ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా కాంబినేషన్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను తను సిద్ధం చేస్తున్నట్టుగా చిన్న హింటిచ్చాడు. ఇక దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతుంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి అన్ని సినిమాలకు వక్కంతం వంశీ కథ రచయిత గా వ్యవహరిస్తు వస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి కూడా తనే కథ ని అందిస్తున్నట్టు గా తెలుస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా రాబోతుందనే విషయం అయితే తెలుస్తుంది. ఇక దీంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ అటు హరీష్ శంకర్, ఇటు సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలని ఫినిష్ చేసిన తర్వాత సురేందర్ రెడ్డి తో చేసే సినిమా మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే సురేందర్ రెడ్డి ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.ఇక ఆయన డైరెక్షన్ లో వచ్చిన చివరి సినిమా అయిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవడంతో సురేందర్ రెడ్డి తీవ్రమైన నిరాశలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా మీదనే తన మొత్తం దృష్టిని పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో కనుక సురేందర్ రెడ్డి సక్సెస్ కొడితే మళ్ళీ స్టార్ హీరోలు తనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక పవన్ కళ్యాణ్ ఆ సినిమాలను ఫినిష్ చేసి ఈ సినిమా మీద రావడానికి మరో సంవత్సరం పట్టే అవకాశం అయితే ఉంది…