Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఓట్ అప్పీల్ చేసుకునేందుకు టాస్క్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శోభా టాస్క్ లో గెలిచి ఇంటి సభ్యుల మద్దతుతో ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇక మళ్ళీ బిగ్ బాస్ పోటీలు నిర్వహించారు. ఇందులో అమర్ దీప్, అర్జున్ నానా తిప్పలు పడి కంటెండర్స్ గా నిలిచారు. ఇక ఇద్దరిలో ఒకరికే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తారో నిర్ణయించాలి అంటూ హౌస్ మేట్స్ తో చెప్పారు బిగ్ బాస్.
ముందుగా ప్రశాంత్, అర్జున్ కి చేస్తున్నట్లు చెప్పాడు. ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదు రీజన్ చెప్పమని అమర్ అడిగాడు. ఏం లేదన్నా.. పోయిన సారి నీకు సపోర్ట్ చేస్తే .. చేయలేదు అన్నావ్. అందుకే ఇప్పుడు నిజంగానే నీకు చేయను అంటూ ప్రశాంత్ షాక్ ఇచ్చాడు. ఇక ఇద్దరి మధ్య వాదన జరిగింది. తర్వాత శోభా, ప్రియాంక లు.. ‘ అమర్ నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి .. వాడికి ఈ వారం చాలా ముఖ్యం అందుకే వాడికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పారు.
ఆ తర్వాత శివాజీ .. అర్జున్ ఓటింగ్ లో చివర్లో ఉన్నాడు. అందుకే అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పాడు. దీంతో అమర్ పిచ్చి పిచ్చి గా మాట్లాడాడు. ‘ ఫినాలే అస్త్ర నా దగ్గర లేదు .. అతని దగ్గర ఉంది .. ఈ డొంకతిరుగుడు వద్దు అంటూ శివాజీ మీద ఫైర్ అయ్యాడు. ఇక యావర్ కూడా అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పాడు.
దీంతో అమర్ ‘ నీతో మంచోడు అనిపించుకోడానికి .. ఈ డ్రామాలన్నీ అని అన్నాడు. డ్రామాలేంటి రా .. అంటూ యావర్ అడిగాడు. దీంతో అమర్ గొడవకి దిగాడు. ఇద్దరు వాదించుకున్నారు .. యావర్ ఏదో అంటుంటే .. నేను కెప్టెన్ ని చెప్పినట్టు చెయ్ .. మాట్లాకుండా వెనక్కి వెళ్ళు అంటూ అమర్ కేకలేశాడు. ఏంటి మాట్లాడుతుంటే కెప్టెన్ అంటావ్ అంటూ యావర్ అరిచాడు. ఇక్కడున్నది అమర్ .. నేను ఈ హౌస్ కి కెప్టెన్ .. నేను చెప్పినట్టు వినాల్సిందే ..నా మాట వినాల్సిందే అంటూ రెచ్చిపోయాడు.