Janhvi Kapoor : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. ఎన్టీఆర్ తో జాన్వీ జతకట్టిన దేవర థియేటర్స్ లో సందడి చేస్తుంది. అదే సమయంలో ఆమె నటించిన మరో మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
జాన్వీ కపూర్ ఫుల్ హ్యాపీ. ఆమె కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసింది. జాన్వీ కపూర్ పరిశ్రమకు వచ్చి ఆరేళ్ళు అవుతుంది. ఆమెకు బ్రేక్ రాలేదు. అలాగే ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రాలేదు. శ్రీదేవి కూతురన్న కారణంగా జాన్వీ కపూర్ కి దేవరలో అవకాశం దక్కింది. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో, ఈ కాంబినేషన్ పై ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది.
సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఓపెనింగ్ డే రికార్డు వసూళ్లు రాబట్టింది. 2024కి గాను ప్రభాస్ కల్కి అనంతరం మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దేవర వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ. 172 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో దేవరకు మంచి ఆదరణ దక్కింది. కర్ణాటకలో దేవర బాగా పెర్ఫార్మ్ చేస్తుంది.
హిందీ వెర్షన్ కి సైతం చెప్పుకోదగ్గ ఆరంభం లభించింది. ఫస్ట్ డే హిందీ వెర్షన్ రూ. 7 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్లు అంచనా. జాన్వీ కపూర్ దేవర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ నటించిన మరో చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఉలజ్ టైటిల్ తో జాన్వీ కపూర్ హిందీ చిత్రం చేశారు. ఈ మూవీ ఆగస్టు 2న థియేటర్స్ లో విడుదల చేశారు.
ఉలజ్ చిత్రానికి సుదాన్ష్ సారియా దర్శకుడు. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ఉలజ్ చిత్రానికి థియేటర్స్ లో పెద్దగా ఆదరణ దక్కలేదు. రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఉలజ్ మూవీ రూ. 11 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కాగా ఉలజ్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఉలజ్ స్ట్రీమ్ అవుతుంది.
ఉలజ్ మూవీలో జాన్వీ కపూర్ హై కమిషనర్ రోల్ చేసింది. లండన్ లో భారత హై కమిషనర్ గా పని చేసే జాన్వీ కపూర్ కి ఓ కుర్రాడు పరిచయం అవుతాడు. తండ్రి చాటు బిడ్డగా ఉన్న జాన్వీ కపూర్ జీవితంలో అతడి రాకతో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమస్యల నుండి జాన్వీ కపూర్ ఎలా బయటపడింది అనేది కథ..