S.V. Ranga Rao : దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోల డామినేషన్ బాగా కొనసాగుతున్న రోజులలో కూడా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు దాసరి నారాయణరావు. సినిమా ఏదైనా సరే దానికి మూలం దర్శకుడు అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఆ సినిమాకు హీరో ఎవరైనా సరే ఇది దాసరి సినిమా అనిపించుకున్నారు దాసరి నారాయణరావు. దర్శకుడు అంటే ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఆయన సమాధానంగా నిలిచారు. సినిమా షూటింగ్ సెట్లో దర్శకుడు మాటే నెగ్గాలి అనే తత్వం దాసరి నారాయణరావు గారికి ముందు నుంచే ఉంది. తాతా మనవడు అనే తన తొలి సినిమాతోనే అది నిరూపించుకున్నారు దర్శకరత్న దాసరి. ఇక తాత మనవడు అనే సినిమాతో దాసరి నారాయణరావు టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో తాతగా ఎస్వీఆర్, మనవడిగా రాజాబాబు నటించిన సంగతి తెలిసిందే. ఇక ఎస్వీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన షూటింగ్ సెట్లో అడుగు పెట్టారు అంటే అందరూ కూడా సైలెంట్ అవ్వాల్సిందే. అయినా డైలాగ్ చెప్పారంటే కెమెరా కూడా షేక్ అవ్వాల్సిందే. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఎస్.వి.ఆర్ మనసుకు తగ్గట్లు సెట్ లో నడుచుకుంటారు. అలాంటి ఎస్వీఆర్ ను తన మొదటి సినిమాతోనే దాసరి డీల్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో ఒక కీలక సన్నివేశం తీస్తున్న సమయంలో ఆ సినిమాలోని కీలక నటీనటులందరూ అక్కడే ఉన్నారు. ఇక దాసరి ఎస్వీఆర్ కోసం ఒక పెద్ద డైలాగ్ ను రాశారు. ఆ డైలాగ్ ఏకంగా 10 పేజీలు ఉంది. ఆ డైలాగ్ పేపర్ ను సహాయకుడు రేలంగి నరసింహారావు నటుడు ఎస్ వి ఆర్ దగ్గరకు తీసుకుని వెళ్లారట. అప్పుడు ఎస్వీఆర్ నేను చదివాను గానీ నువ్వే చదువు అని చెప్పారట.
రేలంగి ఆ డైలాగు ను చదువుకుంటూ వెళ్తుంటే ఎస్విఆర్ తన మనసులోనే ఆ డైలాగును స్మరణం చేసుకుంటూ ఈ డైలాగును ఇక్కడ కట్ చేయి ఇది తీసేయ్ అంటూ ఎడిట్ చేస్తూ పది పేజీల డైలాగులు కాస్త మూడు పేజీలకు కుదిరించారట. మొత్తం మేటర్ ఈ మూడు పేజీలోనే కన్వే అవుతుంది. వెళ్లి మీ దర్శకుడు కి చెప్పు అని రేలంగితో అన్నారట. ఇదే మాటను రేలంగి వెళ్లి దాసరి నారాయణరావు గారి చెవిలో చెప్పారట. ఇక వెంటనే దాసరి ఎస్ వి ఆర్ దగ్గరకు వెళ్లి పది పేజీల డైలాగును మూడు పేజీలకు కుదిరించారు. కానీ ఈ డైలాగు మొత్తం ఈ సీనుకు అవసరం. మీకు ఈ సీన్ మాత్రమే తెలుసు. కానీ ఒక దర్శకుడిగా నాకు ఈ సీన్కు ముందు జరిగే కథ అలాగే ఈ సీనుకు వెనుక జరిగే కదా మొత్తం తెలుసు.
మొత్తం పది పేజీల డైలాగును చెప్పాలని ఎస్వీఆర్ కు సున్నితంగా చెప్పారట దాసరి. దాంతో ఎస్ వి ఆర్ కు కోపం రావడంతో తన చేతిలో ఉన్న స్క్రిప్ట్ను విసిరిపారేసి రైటర్లు దర్శకులు అయితే ఇదే తలనొప్పి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన ఎస్వీఆర్ 10 పేజీల డైలాగ్ అయితే నేను చెప్పలేను అనుకుంటున్నాడా మీ దర్శకుడు 10 పేజీలు ఏంటి 20 పేజీలు అయినా చెబుతా అంటూ టకటక ఆ డైలాగును స్మరణ చేసుకొని ఒకే షాట్ లో చెప్పారట ఎస్ వి ఆర్. ఇక ఆరోజు షూటింగ్ పూర్తయిన తర్వాత ఎస్విఆర్ భలే వాడివి అయ్యా డైరెక్టర్ చివరకు నువ్వు అన్నదే ప్రూవ్ చేసుకున్నావు అని దాసరిని అభినందించారట.