https://oktelugu.com/

Prashant Varma : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఏం జరుగుతుంది..?ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ డైరెక్టర్లు వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 25, 2024 / 12:52 PM IST

    What will happen in the cinematic universe of Prashant Varma? What kind of movies are coming...

    Follow us on

    Prashant Varma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ డైరెక్టర్లు వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లారు. కానీ యంగ్ డైరెక్టర్స్ మాత్రం తమదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతూ వస్తున్నారు. నిజానికి ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయనకు ఉన్న ఒక విజన్ తో పలు రకాల సినిమాలు చేస్తున్నాడు…

    ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లు తమ హవాని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. పాన్ ఇండియాలో కూడా తమదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలను చేయడంలో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. నిజానికి ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక దానికి సిక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కింద చాలా సినిమాలను చేయాలని చూస్తున్నారు. ఇక అందులో భాగంగానే హనుమాన్, జై హనుమాన్ లతో పాటు మరికొన్ని సినిమాలను కూడా ఇందులో భాగం చేస్తూ ఈ సినిమాల్లో ఉన్న అన్ని క్యారెక్టర్లను సినిమా ఎండ్ పార్ట్ లో కలిపి వాటితో పాటు శత్రువుల మీద యుద్ధం చేయించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.

    ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మా లాంటి దర్శకుడు చాలా చిన్న ఏజ్ లోనే ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్ ను సృష్టించి హాలీవుడ్ రేంజ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ని తీసుకెళ్లాలనే ధృడ సంకల్పం తో ముందుకు దూసుకెళ్లడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మరి ఆయన సినిమాటిక్ యూనివర్స్ లో ఏం జరుగుతుంది…

    జై హనుమాన్ సినిమా తర్వాత బాలయ్య బాబు కొడుకుతో చేస్తున్న సినిమాని స్టార్ట్ చేసి అది పూర్తి చేసిన తర్వాత సినిమాటిక్ యూనివర్స్ లో మరికొన్ని సినిమాలను తెరకెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈయన కొన్ని సినిమాలకు కథలను అందించగా మరి కొంతమంది దర్శకులు ఈ సినిమాటిక్ యూనివర్స్ లోని సినిమాలను డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ తనకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు అల్లుడు అయిన అశోక్ గల్లా హీరోగా వచ్చిన ‘దేవకి వందన వసుదేవ’ సినిమాకి కథను అందించాడు. మరి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేకపోయింది. మొదటి షో తోనే ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో ప్రశాంత్ వర్మ ఖాతాలో ఒక ఫ్లాప్ సినిమా అయితే వచ్చి చేరిందనే చెప్పాలి…