https://oktelugu.com/

 Kapil Sharma Show : రోహిత్ శర్మ , ఎన్టీఆర్ కపిల్ శర్మ షోలో సందడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ అవుతున్న ప్రోమో వీడియో…

బాలీవుడ్ లో కపిల్ శర్మ షోస్ కి చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది. దానికి సెపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడం లో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఈయన షోస్ కి కూడా అంత మంచి క్రేజ్ అయితే ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 14, 2024 / 04:50 PM IST

    Kapil Sharma Show  

    Follow us on

    Kapil Sharma Show :  సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకొని ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమాలే కాకుండా ఆడియన్స్ కి కొన్ని టివి షోలు కూడా చాలావరకు ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ సక్సెస్ ఫుల్ షో అయినా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సీజన్ వన్ భారీ సక్సెస్ ని సాధించింది. ఇంకా దానికి కొనసాగింపుగా సీజన్ 2 ను కూడా స్టార్ట్ చేశారు. ఇక దానికి సంబంధించిన ప్రోమో ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే సీజన్ 2 లో టి20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మతో పాటు ఇతర క్రికెటర్లు..

    అలాగే ఎన్టీఆర్ జాన్వీ కపూర్, అలియా భట్ కరణ్ జోహార్లతో ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ప్రోమో ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే మొదటి సీజన్ భారీ సక్సెస్ ని సాధించిన నేపథ్యంలో ఈ షో కి కొనసాగింపు గా రెండో సీజన్ కూడా రావడం ఇప్పుడు ప్రేక్షకులందరిలో ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఇక ఈ షో కి భారీ ఆదరణ దక్కడమే కాకుండా సినిమా హీరోలు సినిమా తరఫున ప్రమోషన్స్ చేసుకోవడానికి కూడా ఈ ప్లాట్ ఫామ్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందనే చెప్పాలి.

    ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ భారీ సక్సెస్ ను సాధించాలి అంటే ఇలాంటి షోల ద్వారా తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి సినిమా వాళ్లు ఎక్కువగా ప్రమోషన్స్ కోసమే ఇలాంటి షోస్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన దేవర సినిమాని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈనెల 21వ తేదీన ది గ్రేట్ ఇండియన్ సీజన్ 2 గ్రాండ్ గా స్టార్ట్ అవ్వబోతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీల ప్రోమోని రిలీజ్ చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ షో ఎలాంటి రెస్పాన్స్ ను సంపాదించుకుంటుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…