Aruguru Pativratalu Movie Fame Amrutha: వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ఈవీవీకి మంచి పేరుంది. ఆయన విభిన్నమైన కథాంశాలతో చిత్రాలు తెరకెక్కించారు. ప్రేక్షకులను మెప్పించారు. ప్రేమఖైదీ నుంచి మొదలుకుని అన్ని సినిమాల్లో వెరైటీనే ప్రధానాంశంగా తీసుకుని చిత్రాలు చేయడం ఆయన అలవాటు. అలా వచ్చిన చిత్రమే ఆరుగురు పతివ్రతలు. ఈ సినిమాలో ఆడవారి జీవితాల గురించి అద్భుతంగా చూపించారు. వారు పడే బాధలు వారి జీవనగమనంపై దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన అమృత మంచి నటనకు గుర్తింపు సంపాదించుకుంది. కానీ తరువాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఆమె కన్నడ నటి. ఈవీవీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ సినిమాలో నటింపజేశారు. దీనికి ఆమెకు మంచి పేరు వచ్చింది కానీ తరువాత అవకాశాలు మాత్రం రాలేదు.
ఆమె తన పాత్రలో నటించలేదు జీవించింది. దీంతో ప్రేక్షకుల హృదయాల్లో నిండిపోయింది. ఆమె పాత్రకు మంత్రముగ్దులైన ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఆ సినిమా వస్తే చూడకుండా ఉండలేరు. అమృత తన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసింది. తరువాత చిత్రాల్లో అలాంటి పాత్రలకైతేనే బాగుంటుందని ఆమెకు ఇతర అవకాశాలు రాలేదని తెలుస్తోంది. కానీ కన్నడంలో మాత్రం ఆమె వరుస అవకాశాలతో మంచి నటిగానే గుర్తింపు తెచ్చుకుంది. కానీ తెలుగులో మాత్రం మరే సినిమాలోనూ కనిపించలేదు.
Also Read: Gopichand- Director Teja: హీరో గోపిచంద్ విషయంలో దర్శకుడు తేజ చేసిన తప్పు ఏంటి?
కొన్నాళ్లకు ఓ ఎన్ ఆర్ ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిపోయింది. కానీ అక్కడ ఓ కేసులో పట్టుబడి మళ్లీ ఇండియాకే వచ్చి ప్రస్తుతం బెంగుళూరులో ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అమృత నటనకు అద్భుతంగా ఉందని ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఆమెకు కితాబిచ్చారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కూడా తన ప్రతిభను చూపించి చిత్రాన్ని ఎన్నో మలుపులు తిప్పి కథలో కొత్తదనం చూపించారు. దీంతోనే ఆ సినిమాకు అంతటి ప్రాధాన్యం ఏర్పడింది.
అమృత సహజసిద్ధమైన నటన ఎంతో ఆకట్టుకుంది. చిత్రంలో అందరికంటే ఎక్కువ మార్కులు ఆమెకే పడ్డాయి. దీంతో తరువాత సినిమాల్లో అవకాశాలు వస్తాయని అనుకున్నా ఆమె ఆశ తీరలేదు. తెలుగులో ఆఫర్లు రాలేదు. దీంతో ఆమె కన్నడ చిత్ర సీమకే పరిమితమయ్యారు. కానీ తెలుగు వారికి మాత్రం తన నటనతో మంచి అభిప్రాయం కలిగేలా చేసింది. అమృత చేసింది ఒక్క సినిమాయే అయినా విలువైన గుర్తింపు తెచ్చుకుని ఆకట్టుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఖాళీగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.