Sleep Tips: మనిషికి జీవితంలో రెండే ప్రధానమైనవి. ఒకటి తిండి రెండోది నిద్ర. తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. సుఖంగా నిద్ర పోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. దీంతో వెన్నంటుకుంటూనే కన్నంటుకోవాలంటే ఏం చేయాలనేదానిపై పలువురు పలు విధాలుగా చెబుతున్నారు. మంచిగా నిద్ర పోవాలంటే ఉదయం, సాయంత్రం రెండు పూటలా వ్యాయామం చేయాలి. దీంతో శరీరం అలసిపోయి పడుకోగానే నిద్రలోకి జారుకుంటాం.

మంచి నిద్ర మనకు ఎంతో మేలు కలుగుతుంది.
సరైన విధంగా నిద్ర పోవాలంటే రోజు ఒకే సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. దీనికి మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా తరువాత అదే అలవాటుగా మారుతుంది. కచ్చితంగా సమయానికి అనుకోకుండా నిద్ర రావడం గమనార్హం. నిద్ర పోవడానికి కనీసం ఓ మూడు గంటల ముందే భోజనం చేయాలి. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయితే నిద్ర కూడా బాగా పడుతుంది. తిన్న వెంటనే పడుకుంటే నిద్ర రావడం కష్టమే. తిన్న ఆహారం త్వరగా అరిగితేనే నిద్ర త్వరగా పట్టి హాయిగా ఉంటుంది.
పడక గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. చీకటిగా ఉంటేనే నిద్ర వస్తుంది.
కొంత మందికి మాత్రం లైటు ఉంటేనే నిద్ర వస్తుంది. లేదంటే నిద్ర పట్టదు. ఎవరికి ఇష్టమైన రీతిలో వారు నిద్ర పోవడానికి సిద్ధం కావచ్చు. మొబైల్ ను పక్కన పెట్టుకోవాలి. రాత్రి ఎక్కువ సమయం మొబైల్ చూస్తూ గడిపితే నిద్ర పట్టదు. టీ, కాఫీలు తాగితే అందులో ఉండే కెఫిన్ వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అందుకే రాత్రి సమయంలో కాఫీ, టీల అలవాటు ఉంటే మానుకోవాలి. ఒత్తిడిని దూరం చేసుకుంటేనే నిద్ర వస్తుంది. నిద్ర పోయే ముందు ప్రశాంతంగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

శరీరంలో తక్కువ ఉష్ణో్గ్రత ఉంటే చక్కని నిద్ర పడుతుంది. స్నానం చేస్తే ఒంట్లో వేడి తగ్గించుకుంటే మంచి నిద్ర సొంతం అవుతుంది. మధ్యాహ్నం కునుకు తీస్తే మంచిదే. కానీ ఎక్కువ సేపు నిద్ర పోతే ఇబ్బందే. దీంతో రాత్రుళ్లు నిద్ర పట్టడం కష్టమవుతుంది. పగటి పూట నిద్ర పోవడం మానుకుంటేనే ప్రయోజనం. పుస్తకాలు చదివే అలవాటు ఉంటే కూడా నిద్ర మనకు దక్కుతుంది. కాసేపు పుస్తకం చదివితే ఇట్టే నిద్ర పోవచ్చు. పడుకునే ముందు ధ్యానం చేస్తే కూడా మంచి ఫలితం వస్తుంది. దీనికి అలవాట్లు చేసుకుంటే నిద్ర రావడం సహజమే.