https://oktelugu.com/

Naveen Polishetty : రణబీర్ కపూర్ ‘రామాయణం’ లో నవీన్ పోలిశెట్టి..ఏ పాత్రలో కనిపించబోతున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బాలకృష్ణ సోషల్ మీడియా లో నవీన్ పోలిశెట్టి గురించి ప్రచారం అడగగా, దానికి నవీన్ సమాధానం చెప్తూ 'ఇలాంటి వార్తలు విన్నప్పుడు నా నరాల్లో కరెంటు పాస్ అవుతుంది . అద్భుతమైన పబ్లిసిటీ జరుగుతుంది, నిజంగా జరిగితే బాగుండును అనుకున్నాను. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేను లక్ష్మణుడి పాత్ర పోషించినట్టు ఊహించుకున్నాను'

Written By:
  • Vicky
  • , Updated On : December 8, 2024 / 09:40 AM IST

    Naveen Polishetty

    Follow us on

    Naveen Polishetty : లాక్ డౌన్ తర్వాత మన టాలీవుడ్ లో కొంతమంది యంగ్ హీరోలు సూపర్ హిట్స్ ని అందుకొని మంచి క్రేజ్ ని దక్కించుకున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో వీళ్ళు తమకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి యంగ్ హీరోలలో ఒకడు నవీన్ పోలిశెట్టి. ఈయన హీరో కాకముందు యాంకర్ గా పని చేసాడు. ఆ తర్వాత పలు తెలుగు, హిందీ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసాడు. ముఖ్యంగా ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా కెరీర్ సాగదీస్తున్న ఈయన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ అనే చిత్రంతో మొట్టమొదటిసారిగా హీరోగా మన ముందుకొచ్చాడు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో, వెంటనే ఆయన ‘జాతి రత్నాలు’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

    మంచి క్రేజ్ ని అయితే సంపాదించుకున్నాడు కానీ, సినిమాలు మాత్రం చాలా ఆలస్యంగా చేస్తుంటాడు. 2021 వ సంవత్సరం లో ‘జాతి రత్నాలు’ చిత్రం విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత సుమారుగా రెండేళ్ల సమయం తీసుకొని ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో మన ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. కానీ ఈ ఏడాది ఆయన నుండి ఎలాంటి సినిమా రాలేదు. కనీసం వచ్చే ఏడాది అయినా వస్తుందా అంటే అనుమానమే. ఇతన్ని చూసిన ప్రతీ ఒక్కరు పాత రోజుల్లో చిరంజీవి నటన గుర్తుకొస్తుంది అని ప్రశంసించారు. కానీ కుర్ర హీరో అయ్యుండి ఇంత ఆలస్యంగా సినిమాలు చేయడమే అందరినీ ఆడియన్స్ నుండి ఎదురు అవుతున్న కంప్లైంట్. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈయన శ్రీలీల తో కలిసి ‘అన్ స్టాపబుల్ 4’ టాక్ షోలో పాల్గొన్నాడు.

    ఇది ఇలా ఉండగా బాలకృష్ణ సోషల్ మీడియా లో నవీన్ పోలిశెట్టి గురించి ప్రచారం అడగగా, దానికి నవీన్ సమాధానం చెప్తూ ‘ఇలాంటి వార్తలు విన్నప్పుడు నా నరాల్లో కరెంటు పాస్ అవుతుంది . అద్భుతమైన పబ్లిసిటీ జరుగుతుంది, నిజంగా జరిగితే బాగుండును అనుకున్నాను. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేను లక్ష్మణుడి పాత్ర పోషించినట్టు ఊహించుకున్నాను’ అంటూ చాలా ఫన్నీ గా సమాధానం చెప్పాడు నవీన్ పోలిశెట్టి. ఆయన మాట్లాడిన ఈ మాటలకు బాలయ్య బాబు పగలబడి నవ్వుతాడు. ఇలా ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్నీ గా సాగిపోతుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి శ్రీలీల తో కలిసి ‘అనగనగ ఒక రాజు’ చిత్రం చేస్తున్నాడు. మ్యాడ్ ఫ్యాన్ కళ్యాణ్ సాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు