https://oktelugu.com/

NTR: మిగతా స్టార్ హీరోలు ఏం చేస్తే ఎన్టీయార్ కూడా అదే చేస్తాడా..? ఆయనకంటూ ఒక ఓన్ స్టైల్ లేదా..?

ఇండస్ట్రీ లో కొంతమంది స్టార్ హీరోలు వాళ్ల కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 19, 2024 / 08:56 PM IST

    Junior NTR

    Follow us on

    NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. వాళ్ల బాబాయ్ అయిన బాలయ్య బాబుకి ఎలాంటి ఇమేజ్ అయితే ఉందో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా బీ,సీ సెంటర్లో అంత మంచి క్రేజ్ ఉంది. అలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండటమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక నందమూరి అభిమానులందరూ అతన్ని ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసమే ఆయన చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ ని అందుకుంటే వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఏకైక స్టార్ హీరోగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    అయితే ఎన్టీయార్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూనే తన తోటి హీరోలు ఎలాంటి సక్సెస్ లను అయితే అందుకున్నారో అలాంటి కథలతోనే ఎన్టీయార్ సినిమాలు చేయాలని చూశాడు…ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమా బాగా నచ్చిన ఎన్టీఆర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో కంత్రి సినిమా చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక పోకిరి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో కంత్రి సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. ఇక రామ్ చరణ్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టడమే కాకుండా రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోగా కూడా రామ్ చరణ్ గుర్తింపును సంపాదించుకున్నాడు…ఇక ఎన్టీఆర్ అలాంటి సినిమా చేయాలని శక్తి సినిమా చేసి భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు…

    ఇక మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక అలాంటి సినిమానే చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీనువైట్ల దర్శకత్వంలోనే బాద్షా అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా కొంతవరకు యావరేజ్ గా ఆడినప్పటికీ అనుకున్న సక్సెస్ అయితే సాధించలేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ దేవర అనే సినిమా చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమా కూడా కొంచెం కేజిఎఫ్ ఎలివేషన్స్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ తన సొంత నిర్ణయాలతో కాకుండా మిగతా హీరోల ఎలాంటి సక్సెస్ లను అయితే సాధించారో అలాంటి సినిమాలతో సక్సెస్ లను సాధించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఇక దానివల్ల ఆయనకు చాలా సార్లు మైనస్ అయితే జరుగుతూ ఉంటుంది…