https://oktelugu.com/

Johnny Master: జానీ మాస్టర్ ని పోలీసులకు పట్టించింది సొంత భార్యేనా..? ఇదేమి ట్విస్టు అండీ బాబోయ్!

జానీ మాస్టర్ గోవా లో ఉన్నాడనే సమాచారం ఆయన భార్య సుమలత ద్వారానే తెలుసుకున్నారట. అది ఎలా తెలుసుకున్నారట అనే విషయం మాత్రం బయటపడలేదు. ఇదంతా పక్కన పెడితే నేడు ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్ కి వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 19, 2024 / 08:53 PM IST

    Johnny Master(2)

    Follow us on

    Johnny Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు రోజురోజుకి సరికొత్త మలుపులు తీసుకుంటుంది. శ్రేష్టి వర్మ అనే యంగ్ డ్యాన్సర్ కేసు పెట్టినప్పటి నుండి అజ్ఞాతం లోకి వెళ్లిన జానీ మాస్టర్ ని నేడు పోలీసులు గోవా లో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకొచ్చారు. పోస్కో చట్టం క్రింద జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. జానీ మాస్టర్ అజ్ఞాతం లోకి వెళ్ళగానే పోలీసులు అతని కోసం నాలుగు బృందాలుగా విడిపోయి వెతకడం మొదలు పెట్టారు. ఒక బృందం నార్త్ ఇండియా లో వెతకగా, మరో బృందం జానీ మాస్టర్ పుట్టి పెరిగిన నెల్లూరు జిల్లాలో గాలించింది. టాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే కాకుండా, జానీ మాస్టర్ శాండిల్ వుడ్ లో కూడా టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు. దీంతో అక్కడ తనకి ఉన్న పరిచయాలతో ఎక్కడైనా తలదాచుకున్నాడా అని బెంగళూరు మొత్తం ఆయన కోసం గాలించారు పోలీసులు. కానీ అక్కడ కూడా దొరకలేదు. చివరికి ఆయన గోవా లో దొరికాడు.

    ఇదంతా పక్కన పెడితే జానీ మాస్టర్ గోవా లో ఉన్నాడనే సమాచారం ఆయన భార్య సుమలత ద్వారానే తెలుసుకున్నారట. అది ఎలా తెలుసుకున్నారట అనే విషయం మాత్రం బయటపడలేదు. ఇదంతా పక్కన పెడితే నేడు ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ఆమె రాగానే మీడియా చుట్టుముట్టి ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. దీంతో చిరాకు పడిన సుమలత ‘మీపై పోలీస్ కేసు పెడతాను’ అని బెదిరించింది. తనకి ఒక ఫేక్ ఫోన్ కాల్ వచ్చిందని, దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినట్టుగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె కారు ఎక్కి వెళ్ళిపోయింది.

    అయితే కాసేపటి క్రితమే ఆమె మరోసారి మీడియా తో మాట్లాడుతూ ‘నా భర్తపై వస్తున్నా అత్యాచార ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. కావాలని కుట్ర చేసి ఆయన కెరీర్ ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. లవ్ జిహాదీ అని మీడియా లో ఏదేదో అంటున్నారు. నా భర్త అలాంటి వ్యక్తి కాదు. ఒకవేళ ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు నిజమని రుజువు అయితే నేను నా భర్త ని వదిలేస్తా. ఆ అమ్మాయి మంచిది కాదు, ఆమెకు ఇండస్ట్రీ లో చాలా అఫైర్స్ ఉన్నాయి. నా భర్త కి నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుండి అతనిపై ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఆయన దేశం పట్ల, సమాజం పట్ల ఎంతో గౌరవం ఉంది. నలుగురికి సహాయం చేసే మనస్తత్వమే తప్ప, ఎవరికీ అన్యాయం చేయాలని ఆయన కోరుకోలేదు. ఈ దేశం కోసం ఆయన తన ప్రాణాలను సైతం ఇచేసేంత గొప్ప మనస్కుడు’ అంటూ సుమలత చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం మెగా బ్రదర్ నాగబాబు కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా జానీ మాస్టర్ కి సపోర్టుగా పరోక్షంగా ట్వీట్లు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. నెమ్మదిగా జానీ మాస్టర్ కి ఇండస్ట్రీ నుండి మద్దతు లభిస్తుంది.