Ram Gopal Varma: దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘లైగర్’ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సినిమాను తొలి షోను చూసి ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ట్విట్టర్ లో ఇప్పటికే లైగర్ మేనియా మారుమ్రోగుతోంది. ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ యాక్టింగ్, సినిమా గురించే చెప్పుకుంటున్నారు.

హైదరాబాద్ లో లైగర్ సినిమా చూసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వర్మ శిష్యుడే పూరి జగన్నాథ్. కొద్ది కాలం కిందట వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. అందుకే పూరిని ‘గాడు’ అని సంబోధించేంతటి సాన్నిహిత్యం వారి మధ్యన ఉంది.
అరేయ్ ‘పూరీ’ అని వర్మ పిలవడం.. దానికి ఎస్ బాస్ అంటూ పూరి సమాధానం ఇచ్చిన వీడియోలు మనం చూశాం. తాజాగా లైగర్ మూవీ చూసిన రాంగోపాల్ వర్మ మీడియా ఎదుట చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లైగర్ చూసి వచ్చిన వర్మ ముందు మైకులు పట్టుకొని నిలబడ్డారు మీడియా ప్రతినిధులు.. లైగర్ పై అభిప్రాయం చెప్పమని వర్మను అడగ్గానే.. తెలంగాణ యాసలో వర్మ సెటైర్లు వేశాడు. ‘పూరీ జగన్నాథ్ గాడు ఏం సినిమాలు చేస్తున్నాడు … వాడిని కొట్టి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను’ అంటూ తిట్టాడో పొగిడాడో కూడా తెలియకుండా స్పందించకుండానే పూరి వెళ్లిపోయాడు. మరి లైగర్ హిట్ నా? ఫ్లాప్ నా? అన్నది వర్మ మాటల్లో అర్తం కాలేదు.



[…] Also Read: Ram Gopal Varma: పూరీ జగన్నాథ్ గాడు ఏం సినిమాలు … […]
[…] Also Read:Ram Gopal Varma: పూరీ జగన్నాథ్ గాడు ఏం సినిమాలు … […]