https://oktelugu.com/

ఏం మెసేజ్ ఇదీ: తెలుగు సీరియళ్లు.. వివాహేతర సంబంధాలు

————————— నరేశ్ ఎన్నం —————– ఏ సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగానే పరిస్థితి తయారైంది. తెలుగు సీరియళ్లు అన్నీ కూడా పాడు కాన్సెప్ట్ లతో పాడిబడిపోతున్నాయని సగటు ప్రేక్షకుడు విమర్శిస్తున్నాడు. అందరికంటే మగాళ్లే ఇక్కడ తెగ బాధపడిపోతున్నారు. అసలు కుటుంబంతో చూసే సీరియళ్లు కానే కావని అంటున్నారు. ఇప్పుడు మొత్తం సీరియళ్ల ట్రెండ్ అంతా చూస్తే అన్నీ వివాహేతర సంబంధాలపైనే నడుస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాలతో కుటుంబలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు.. పిల్లలకు ఏం సూచిస్తున్నట్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 16, 2021 9:52 pm
    Follow us on

    ————————— నరేశ్ ఎన్నం —————–

    ఏ సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగానే పరిస్థితి తయారైంది. తెలుగు సీరియళ్లు అన్నీ కూడా పాడు కాన్సెప్ట్ లతో పాడిబడిపోతున్నాయని సగటు ప్రేక్షకుడు విమర్శిస్తున్నాడు. అందరికంటే మగాళ్లే ఇక్కడ తెగ బాధపడిపోతున్నారు. అసలు కుటుంబంతో చూసే సీరియళ్లు కానే కావని అంటున్నారు.

    ఇప్పుడు మొత్తం సీరియళ్ల ట్రెండ్ అంతా చూస్తే అన్నీ వివాహేతర సంబంధాలపైనే నడుస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాలతో కుటుంబలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు.. పిల్లలకు ఏం సూచిస్తున్నట్టు అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

    తెలుగు టీవీ చానెళ్లలో పాపులర్ అయిన అత్యధిక రేటింగ్ గల కార్తీకదీపం సీరియల్ ను చూస్తే అందులో హీరో కార్తీక తన భార్య దీపను అనుమానించి పదేళ్లుగా దూరం పెడుతాడు. వాళ్లద్దరూ కలిసే లోగా కార్తీక స్నేహితురాలికి కడుపు చేస్తాడు. దీంతో మళ్లీ కార్తీక్ దీప దూరం అవుతారు. ఇలా ఒక పెళ్లాం ఉండగా.. మరొకరితో వివాహేతర సంబంధం చూపించిన సీరియల్ తెలుగులో టాప్ లో ఉండడం మన దౌర్భాగ్యం అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

    ఇక గృహలక్ష్మీ సీరియల్ లో అయితే భార్య ఇంట్లో ఉండగానే ప్రియురాలిని ఇంట్లో పెట్టి ఇద్దరితో నరకం అనుభవిస్తున్న భర్త కథను చూపించారు. ఆ తర్వాత వచ్చే ‘దేవత ’ సీరియల్ లోనూ చెల్లెలిని ప్రేమించి అక్కను చేసుకొని ఇద్దిరకీ కడుపు చేసిన హీరో బాధను ఎలివేట్ చేశారు.

    ఈ కథలన్నీ కూడా అక్రమ సంబంధాలు ఎఫైర్ల గోలతో భ్రష్టు పట్టాయని తెలుగు టీవీ జనాలు బాధపడుతున్నారు. ఇలాంటి వాటితో కాపురాలు కూడా కూలుతాయని.. మగాళ్లు ఎఫైర్లు పెట్టుకోవాలని ఇవి ప్రోత్సహిస్తున్నాయని కొందరు మేధావులు ఆడిపోసుకుంటున్నారు. ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అని తిట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కాపురాలు కూల్చే కథలు కాకుండా జర మెసేజ్ ఇచ్చే స్టోరీలు తీయాలని సగటు ప్రేక్షకులు కోరుతున్నారు.