Devara: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ శాశిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే పాన్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. నిజానికి ఆయన నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా అక్కడ భారీ వసూళ్లను కూడా రాబడుతున్నాయి. ఇక అతని బాటలోనే నడుస్తున్న మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే 2024వ సంవత్సరంలో హనుమాన్, కల్కి, టిల్లు స్క్వేర్ సినిమాలను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర ‘ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే ఈ సినిమాకి బాలీవుడ్ లో అంత పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.
కల్కి సినిమాతో ప్రభాస్ ఎలాంటి భారీ ప్రభంజనాన్ని సృష్టించాడో అలాంటి సక్సెస్ ము అందుకోవడం ఎన్టీఆర్ వల్ల అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ కి పాన్ ఇండియాలో చాలా మంచి మార్కెట్ ఉంది. అతని సినిమాలను చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందువల్లే ఆయన సినిమాకి సక్సెస్ రాగానే భారీ కలెక్షన్స్ ను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లింది.
మరి ఎన్టీఆర్ కి పాన్ ఇండియా మార్కెట్ ఉన్నప్పటికీ ప్రభాస్ తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన బాలీవుడ్ ప్రేక్షకులను ఎలా థియేటర్ కి రప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి దేవర కొరటాల శివ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడం వల్ల ఈ సినిమాతో సక్సెస్ ని కొడితే ఆయన కెరియర్ అనేది మారిపోతుందనే చెప్పాలి. కానీ ఇంతకుముందు ఆయనకు పాన్ ఇండియా సినిమా చేసిన అనుభవం లేకపోవడం వల్ల ఆయనకు అక్కడ మార్కెట్ కూడా పెద్దగా లేదు.
కాబట్టి ఎన్టీఆర్ ఒక్కడి మీద ఈ సినిమా డిపెండ్ అయి ఉంది. ఇక ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ని వేగవంతం చేయాలి. అలాగే ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ప్రేక్షకుల్లో పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. కాబట్టి ప్రమోషన్స్ ని వేగవంతం చేసి సినిమా మీద హై వోల్టేజ్ అంచనాలు పెరిగే విధంగా ప్రమోషన్స్ ను నిర్వహించాలి. అదొక్కటే ఇప్పుడు దేవర సినిమా ముందున్న భారీ లక్ష్యంగా కనిపిస్తుంది…