https://oktelugu.com/

Vikram: ‘తంగలాన్’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన విక్రమ్…నెక్స్ట్ మూవీని ఆ స్టార్ డైరెక్టర్ తో చేయనున్నాడా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో విక్రమ్ లాంటి నటుడు మరొకరు లేరనేది వాస్తవం... ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఒక సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం కూడా మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : August 21, 2024 / 10:23 AM IST

    Vikram(1)

    Follow us on

    Vikram: ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయిన చాలా సినిమాల్లో విక్రమ్ ‘తంగలాన్ ‘ సినిమా ఒకటి…అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇప్పటికే ఈ సినిమాతో భారీ ప్రయోగాన్ని చేసిన విక్రమ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇప్పటివరకు తను ప్రతి సినిమాలో కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ ఆ సినిమాలు ఏవి ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేకపోవడం ఆయనకు తీవ్రంగా నిరాశను మిగిల్చాయి. ఇక 2005వ సంవత్సరంలో వచ్చిన ‘అపరిచితుడు ‘ సినిమా తర్వాత ఆయన చేసిన ఏ ప్రయోగం కూడా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినప్పటికీ ఆయన ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తన పేరుని సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలనే ఉద్దేశ్యంతోనే చాలా గొప్ప క్యారెక్టర్లను చేస్తూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే తంగలాన్ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

    పా.రంజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరికొన్ని డిఫరెంట్ సినిమాలను చేసే ప్రయత్నం లో విక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తమిళంలో స్టార్ డైరెక్టర్ ఆయన మురుగ దాస్ డైరెక్షన్ లో విక్రమ్ మరొక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం విక్రమ్ శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన విక్రమ్ తో ఒక డిఫరెంట్ జానర్లో సినిమాని తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    అయితే ఇది కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ సినిమా కావడం విశేషం.. ఇక ఎక్స్పరిమెంటల్ సినిమా అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు విక్రమ్… కాబట్టి విక్రమ్ ఎలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసినా కూడా జనాలు ఆదరించడానికి రెడీగా ఉన్నారు. ఆయన ఒక క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడతాడు అనేది స్క్రీన్ మీద ఆయనను చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది.

    ప్రతి క్యారెక్టర్ లోని వేరియేషన్స్ కోసం ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆయన వేటు పెరగడం, తగ్గడం బాడిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు. అందువల్లే ఆయన కంటూ ఇండస్ట్రీలో ఒక సపరేట్ క్రేజ్ అయితే ఉంది… చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా ఆయన మంచి సక్సెస్ లను అందుకొని పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడా లేదా అనేది…