https://oktelugu.com/

Hero Yash: య‌ష్ తో మూవీ చేసేందుకు క్యూ క‌డుతున్న ఇండియ‌న్ డైరెక్టర్లు.. ఎవ‌రికి గ్రీన్ సిగ్న‌ల్‌..?

Hero Yash: ప్ర‌స్తుతం క‌న్న‌డ స్టార్ హీరో యష్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. రీసెంట్ గా వ‌చ్చిన కేజీఎఫ్‌-2 ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేజీఎఫ్ సిరీస్‌తో అత‌ను ఇప్పుడు పాన్ ఇండియ‌న్ హీరోగా మారిపోయారు. కేజీఎఫ్ కు ముందు కేవ‌లం క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి మాత్ర‌మే ప‌రిచ‌యం ఉన్న ఆయ‌న.. ఇప్పుడు నేష‌న‌ల్ హీరోగా మారిపోయారు. ఈ స్థాయికి రావ‌డానికి య‌ష్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆర్టీసీ బ‌స్ డ్రైవ‌ర్ కొడుకు అయిన య‌ష్.. త‌న […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 22, 2022 / 11:18 AM IST
    Follow us on

    Hero Yash: ప్ర‌స్తుతం క‌న్న‌డ స్టార్ హీరో యష్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. రీసెంట్ గా వ‌చ్చిన కేజీఎఫ్‌-2 ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేజీఎఫ్ సిరీస్‌తో అత‌ను ఇప్పుడు పాన్ ఇండియ‌న్ హీరోగా మారిపోయారు. కేజీఎఫ్ కు ముందు కేవ‌లం క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి మాత్ర‌మే ప‌రిచ‌యం ఉన్న ఆయ‌న.. ఇప్పుడు నేష‌న‌ల్ హీరోగా మారిపోయారు.

    Hero Yash

    ఈ స్థాయికి రావ‌డానికి య‌ష్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆర్టీసీ బ‌స్ డ్రైవ‌ర్ కొడుకు అయిన య‌ష్.. త‌న సొంత ట్యాలెంట్ తో చిన్న చిన్న వేషాలు వేసే స్థాయి నుంచి హీరోగా మారి.. వ‌రుస పెట్టి హిట్లు కొడుతూ క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో అయిపోయారు. ఇక ఇప్పుడు కేజీఎఫ్ తో ఇత‌ర భాష‌ల హీరోల‌కు కూడా పోటీ ఇచ్చే రేంజ్‌కు ఎదిగిపోయాడు.

    Also Read: Star Heroine: మేకప్ రూంలో అందాలను ఆరబోసిన స్టార్ హీరోయిన్..!

    అయితే కేజీఎఫ్ స‌క్సెస్ త‌ర్వాత య‌ష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నార‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా ఉంది. కానీ య‌ష్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. త‌న మార్కెట్‌ను కాపాడుకోవ‌డానికి పాన్ ఇండియా సినిమానే చేయాల‌ని భావిస్తున్నాడంట‌. క‌థ విష‌యంలో ఎలాంటి కాంప్ర‌మైజ్ కావొద్ద‌ని నిర్ణ‌యించుకున్నాడంట‌.

    ఇక ప్ర‌స్తుతం బాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా యష్ తో మూవీ చేయ‌డానికి ముందుకొచ్చారంట‌. కానీ య‌ష్ మాత్రం ఇంకా ఓకే చెప్ప‌లేదు. రీసెంట్ గా జేమ్స్ మూవీ డైరెక్ట‌ర్ చేతన్ కూడా య‌ష్ తో సినిమా చేద్దామ‌ని చెప్పగా సున్నితంగా తిర‌స్క‌రించాడంట య‌ష్. ఎందుకంటే తాను చేయ‌బోయే త‌ర్వాతి సినిమా త‌న మార్కెట్ ను డిస్ట‌ర్బ్ చేసే విధంగా ఉండొద్ద‌ని భావిస్తున్నాడు.

    Hero Yash

    గ‌తంలో టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ యష్ కు ఓ క‌థ చెప్పాడు. అప్ప‌ట్లో వీరి మూవీ ప‌ట్టాలెక్కుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ క‌థ విషయంలో కొన్ని డౌట్స్ రావ‌డం వ‌ల్ల పూరి వెన‌క్కు త‌గ్గాడంట‌. ఇక ఇప్పుడు ఇత‌ర భాష‌ల డైరెక్ట‌ర్లు కూడా య‌ష్‌కు ఫోన్లు చేస్తున్నా.. అత‌ను మాత్రం చూద్దాం అన్న‌ట్టు స‌మాధానం ఇస్తున్నాడంట‌. మ‌రి ఎవ‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో వేచి చూడాలి.

    Also Read:Rashmika Mandanna: ఆలియా ప్లేస్ కొట్టేసిన రష్మిక.. ఇది ఎన్టీఆర్ కి షాకే !

    Recommended Videos:

    Tags