Star Producers: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి చాలామంది నిర్మాతలు చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్లు సైతం తెలుసుకోవాల్సిన వాస్తవం ఒకటైతే ఉంది. స్టార్ హీరోలందరు చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తే పర్లేదు. కానీ ప్లాప్ టాక్ వస్తే మాత్రం ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి చాలామంది స్టార్ ప్రొడ్యూసర్లు వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక స్టార్ హీరోల వెంట పడకుండా చిన్న బడ్జెట్ తో చిన్న సినిమాలను నిర్మించి సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెల్లచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించిన ప్రొడ్యూసర్స్ రెండున్నర కోట్ల బడ్జెట్ పెడితే 25 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిజానికి ఇలాంటి వసూళ్లు రావడం అనేది మామూలు విషయం కాదు.
మరి ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో సినిమాలను చేసి ప్రేక్షకుల ముందు ఉంచితే ఆ సినిమా ఆటో మేటిగ్గా సూపర్ సక్సెస్ సాధిస్తోంది కదా అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు… ఇక మొత్తానికైతే స్టార్ ప్రొడ్యూసర్లు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కూడా హీరోల రెమ్యూనరేషన్ విషయంలో అలాగే బడ్జెట్ విషయంలో చాలావరకు తగ్గించి సినిమాలను చేసుకుంటే చాలా మంచిది.
అలా కాకుండా హీరోలు అడిగిన దాని కంటే ఎక్కువ ఇచ్చి ఈ పోటీ ప్రపంచంలో మేము స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాం… సూపర్ సక్సెస్ ని సాధిస్తాం అనే మాటలు చెప్పడం అనేది నిజంగా వాళ్ల మూర్ఖత్వం అవుతోంది తప్ప గొప్పతనం అయితే కాదు. ఇక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో బాగానే ఉంటాడు. సినిమా డైరెక్షన్ చేసిన డైరెక్టర్ కూడా మరో సినిమా చేసుకుంటూ బిజీగా ఉంటాడు.
కానీ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్ మాత్రం విపరీతంగా నష్టపోయి ఉన్నదంతా అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. కాబట్టి సినిమా బడ్జెట్ విషయంలో ప్రొడ్యూసర్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది…ఇకమీదట జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి విజయాలు దక్కే అవకాశాలైతే ఉన్నాయి. లేదు అంటే భారీ నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది…