Vishwambhara Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతుండడం విశేషం…మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన పెద్ద సినిమాలేవి పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఏ సినిమా సైతం ప్రేక్షకుల మన్ననలు పొందడం లేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోతున్నాయి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరి హర వీరమల్లు సైతం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్డమ్ పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉంది.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాతో స్టార్ డైరెక్టర్లు గా మారిన దర్శకులు ఎవరో తెలుసా..?
ఇక రీసెంట్ గా వచ్చిన వార్ 2, కూలీ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆశించిన మేరకు సంతృప్తి పరచలేకపోయాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఇకమీద రాబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కిన విశ్వంభర సినిమాను సైతం ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలైతే చేస్తున్నారు.
మరి వీటన్నింటి పరిస్థితి ఇలా ఉంటే విశ్వంభర పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది స్టార్టింగ్ లోనే రిలీజ్ అవ్వాల్సింది కానీ గ్రాఫిక్స్ పనుల్లో కొంచెం లేట్ అవుతుండడం వల్ల సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ అయితే రావడం లేదు.
ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు సినిమాను చూసి ఎగ్జిట్ అవుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో విశ్వంభర సినిమా ప్రేక్షకుడిని ఎగ్జాక్ట్ చేస్తుందా? లేదంటే ఇంతకుముందు వచ్చిన స్టార్ హీరోల సినిమాల మాదిరిగానే ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…