Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పవర్ స్టార్ అనే ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పటికి తెలుగు సినిమా ప్రేక్షకులంతా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమాలు హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి స్టార్ ఇమేజ్ ని కట్టబెట్టడమే కాకుండా ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించి పెట్టాయి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా ఆయనకు వచ్చే సక్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.ఇక వ్యక్తిత్వం పరంగా ఆయన చాలా ఎక్కువ సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహించి స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. మానవత్వాన్ని చాటుకున్న మనిషిగా అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికిన ప్రతిసారి తన అభిమానుల కోసం సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఆయన అభిమానులు కొంతవరకు నిరాశ చెందారు.
Also Read: ‘వార్ 2’ ని ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే..సంచలనం రేపుతున్న ఆడియో!!
అయినప్పటికి ఆయన ఎక్కడ డీలా పడకుండా ఓజి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో డైరెక్టర్లుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ‘తొలిప్రేమ’ సినిమాతో కరుణాకరణ్ దర్శకుడిగా మారాడు.
మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక బద్రి సినిమాతో పూరి జగన్నాథ్ సైతం డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా చాలా సంవత్సరాల పాటు ఆయన స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు…
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం పవన్ కళ్యాణ్ తో చేసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతోనే మొదటి ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసుకున్నాడు. అప్పటినుంచి ఆయన స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు…గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ సూపర్ సక్సెస్ ను అందుకొని టాప్ డైరెక్టర్స్ లిస్టు లోకి చేరిపోయాడు…మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన చాలా మంది స్టార్ డైరెక్టర్లుగా మారిపోయారు…