హీరోయిన్స్ అనగానే అన్ని సుఖాలే ఉంటాయనుకుంటే పొరపాటే. ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడానికి తెలియకుండానే హీరోయిన్స్ చాలా కష్టాలు పడతారు. ఫిట్ నెస్ కాపాడుకోవడానికి, అలాగే గ్లామర్ ను మెయింటైన్ చేసే విషయంలో హీరోయిన్లు పడే పాట్లు వర్ణనాతీతం. తినే ఆహారంలో కూడా అనేక షరతులు. కడుపు కట్టుకొని బతకడం ఒక రకంగా నరకమే.
దీనికితోడు హీరోయిన్స్ వాడే కాస్మొటిక్స్ కూడా వాళ్ళను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత కేర్ తీసుకున్నా వాటి వల్ల వాళ్ళు చాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పైగా వయసు పెరిగిన హీరోయిన్స్ అంటే సినిమా వాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా చులకనే. సహజంగా వయసు పెరిగే క్రమంలో లావెక్కడం చాలా న్యాచురల్.
కానీ లావెక్కకుండా ఉండేందుకు జిమ్ లో గంటల తరబడి తెగ కష్టపడుతూ, రోజుకు 2సార్లు మాత్రమే తింటూ నలిగిపోతున్న హీరోయిన్లు కోకొల్లలు. అయితే, ఇప్పుడు బాలీవుడ్ బెబో కరీనా కపూర్ గురించే మాట్లాడుకుంటున్నారు మిగిలిన హీరోయిన్లు. 40 ఏళ్ళు దాటినా, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా ఇప్పటికీ కరీనాలో అదే అందం, అదే బిగువు, అదే పట్టు. దాంతో అసలు కరీనా తన అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తోంది అంటూ మిగిలిన వాళ్ళు ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలో కరీనా ఎట్రాక్షన్ కి కారణం ఒక్కటే కనిపిస్తోంది. తన ఫిజిక్ ను మెయింటైన్ చేయడానికి కరీనా ప్రత్యేకమైన డైట్ ను ఫాలో అవుతుంది. ఆహారం మితంగానే తింటుంది. కానీ ఎక్కువసార్లు తింటుంది. రెగ్యులర్ గా వ్యాయామాలు కూడా చేస్తోంది. కానీ ఎక్కువసార్లు చేస్తోంది. ఇక కరీనా ఉదయాన్నే కుంకుమ పువ్వుతో కలిపిన నల్లటి ఎండుద్రాక్షను తింటుంది.
అలాగే కరీనా తీసుకునే ఫుడ్ లో పరాఠా, సబ్జా గింజలు, కొబ్బరినీళ్లు ఎక్కువగా ఉంటాయి. మధ్యాహ్న భోజనం కూడా కేవలం పెరుగన్నంతోనే సరిపెడుతుంది. సాయంత్రం అరటిపండుతో చేసిన మిల్క్ షేక్, రాత్రి కంద,పెరుగుతో కూడిన వెజ్ పులావ్ తింటుంది. మరీ మిగిలిన హీరోయిన్స్ కూడా ఈ డైటే ఫాలో అవుతారేమో.