https://oktelugu.com/

Allu Arjun-Trivikram : అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం త్రివిక్రమ్ ఎంచుకున్న కథ ఇదేనా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక వాళ్ల కంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని తెచ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఎవరైనా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం విపరీతంగా కష్టపడుతూనే ఉంటారు తప్ప ఊరికే ఎవరికైతే సక్సెస్ రావు...ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : December 8, 2024 / 08:33 AM IST

    Allu Arjun-Trivikram Movie

    Follow us on

    Allu Arjun-Trivikram :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలైతే ఇప్పటికే పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి మన హీరోలు చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సబ్జెక్టుగానే రావడం విశేషం…ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడు సినిమాలైతే వచ్చాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమా కూడా రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ కి ఎనలేని గుర్తింపైతే ఉంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా హిట్టు కొట్టడమే కాకుండా అటు అల్లు అర్జున్ కి, ఇటు త్రివిక్రమ్ కి భారీ క్రేజ్ అయితే తెచ్చి పెట్టింది. మరి ఈ సినిమా సాధించిన విజయం తో వీళ్ళ మధ్య బాండింగ్ కూడా ఎక్కువగానే పెరిగింది.

    అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో త్రివిక్రమ్ కి గుంటూరు కారం అనే సినిమా ఫ్లాప్ వచ్చినప్పటికి ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇంతకుముందు ఆయనకు మంచి సక్సెస్ లను సాధించి పెట్టడనే ఉద్దేశ్యంతోనే త్రివిక్రమ్ ఆయనతో సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు.

    మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం త్రివిక్రమ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ ని ఒక పల్లెటూరి హీరోగా చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు త్రివిక్రమ్ చేయనటువంటి ఒక జానర్ ని ఎంచుకొని పీరియాడికల్ ఫిక్షనల్ స్టోరీ గా ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు అంటే తెలుగులో అయితే మంచి బజ్ అయితే ఉంది. కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు త్రివిక్రమ్ పెద్దగా పరిచయం లేదు. మరి ఈ సినిమా మీద అక్కడ ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక వీళ్ళ కాంబోలో వచ్చిన మూడు సినిమాలను బీట్ చేస్తూ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…