https://oktelugu.com/

Rajinikanth: రజినీకాంత్ కి సిల్క్ స్మిత కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

సూపర్ స్టార్ తో నటించడానికి చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే రజినీకాంత్ స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్న సమయంలో ఆయనతోపాటు సిల్క్ స్మిత చాలా సినిమాల్లో ఐటమ్ గర్ల్ గా చేసి మంచి పేరు తెచ్చుకుంది.

Written By: , Updated On : March 16, 2024 / 11:04 AM IST
Rajinikanth and Silk Smitha

Rajinikanth and Silk Smitha

Follow us on

Rajinikanth:  తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి స్టార్ హీరో మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు గానీ ఆయన సాధించిన గుర్తింపు కానీ అలాంటిది. ఇక సూపర్ స్టార్ గా తనకంటూ ఉన్న ఇమేజ్ ని తన సినిమాల ద్వారా రోజు రోజుకి పెంచుకుంటూ వచ్చాడు.

ఇక ఈ క్రమంలోనే ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఇక్కడ కూడా సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి సూపర్ స్టార్ తో నటించడానికి చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే రజినీకాంత్ స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్న సమయంలో ఆయనతోపాటు సిల్క్ స్మిత చాలా సినిమాల్లో ఐటమ్ గర్ల్ గా చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఆమె రజనీకాంత్ తో మంచి ర్యాపో ను కూడా మెయిన్ టెన్ చేసుకుంటూ వచ్చేది.

ఆయన ద్వారా చాలా సినిమాల్లో అవకాశాలను కూడా అంది పుచ్చుకుంది. అయితే ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియా చాలా కథనాలను అయితే రాసింది. కానీ వాళ్ళిద్దరిది జస్ట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అనే ఉద్దేశ్యం లో రజనీకాంత్ కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దానికి తగ్గట్టుగానే ఆమె తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక అలాంటి సమయంలోనే ఆమె స్టార్ ఐటమ్ గర్ల్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇక మొత్తానికైతే ఆమె స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రజినీకాంత్ సపోర్టుతో తమిళ్ ఇండస్ట్రీలో పాపులరిటి ని సంపాదించుకుంది.

ఆ తర్వాత ఆమెను కొంతమంది మోసం చేయడం వల్ల మందుకు బానిసై చనిపోయింది…ఇలా మొత్తానికైతే ఇండస్ట్రీ లో ఎంతో కాలం పాటు కొనసాగుతుంది అని అనుకున్న సిల్క్ స్మిత చాలా చిన్న ఏజ్ లోనే చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి…