https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : రాజమౌళి మహేష్ బాబు తో చేస్తున్న సినిమాకి బాహుబలి కి మధ్య సంబంధం ఏంటంటే..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందులా లేదు. ఒకప్పుడు సినిమాలు నచ్చిన నచ్చకపోయినా అవే సినిమాలను తీస్తూ ప్రేక్షకులకి బోర్ కొట్టించేవారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 24, 2025 / 02:21 PM IST
    Rajamouli , Mahesh Babu

    Rajamouli , Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందులా లేదు. ఒకప్పుడు సినిమాలు నచ్చిన నచ్చకపోయినా అవే సినిమాలను తీస్తూ ప్రేక్షకులకి బోర్ కొట్టించేవారు. కానీ ఇప్పుడు మాత్రం కొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుతం వాళ్లకంటూ ఒక భారీ సక్సెస్ ని సాధించడానికి చాలా మంది హీరోలు ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక హీరోల ఇమేజ్ కి తగ్గట్టు స్టోరీ లను రాస్తూ దర్శకులు చాలా మంచి సినిమాలు చేయడానికి సిద్ధమవ్వడం విశేషం… ఇప్పటి దాకా ఒకే కానీ వాళ్ళు చేస్తున్న సినిమాలు యావత్ ప్రేక్షకులందరిని మెప్పిస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

    దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి (Rajamouli) ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక బాహుబలి (Bahubali) సినిమా రెండు పార్టులుగా వచ్చి ఇండియాలో ఘన విజయాన్ని సాధించింది.
    ఇక మొత్తానికైతే ఈ సినిమాను తీసినందుకు రాజమౌళి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చాలా సందర్భాల్లో తెలియజేశారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన సినిమాల్లో ఈ సినిమా మొదటి వరుసలో ఉంటుంది. ఇంతకుముందు బాలీవుడ్ వాళ్లు మనల్ని పట్టించుకునే వాళ్ళు కాదు కానీ బాహుబలి సినిమా వచ్చిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ ని పక్కన పెట్టి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా వండర్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చేయబోతున్న సినిమాకి బాహుబలి సినిమాకి మధ్య ఒక సంబంధం అయితే ఉంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

    నిజానికి రెండు సినిమాలు కూడా ఆయనవే కావడం వల్ల రాజమౌళి ఈ సినిమాలకు సంబంధించిన యూనివర్స్ ను ప్లాన్ చేస్తున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఏంటి అంటే బాహుబలి సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ అయితే ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    నిజానికి బాహుబలి సినిమా మొత్తంలో హైలెట్ గా నిలిచేది మదర్ సెంటిమెంట్ మాత్రమే కాబట్టి ఆ మదర్ సెంటిమెంట్ ని ఈ సినిమాలో కూడా వాడి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రాజమౌళి మరోసారి తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలని చూస్తున్నాడు.

    ఇక ఇప్పటివరకు ఇండియాలోనే ఆయన ప్రభంజనాన్ని చూపించిన రాజమౌళి ఇకమీదట ప్రపంచవ్యాప్తంగా ఆయన క్రియేట్ చేయబోయే వండర్స్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు… చూడాలి మరి రాజమౌళి ఈ సినిమా కోసం ఎలాంటి ప్రభంజనాలను క్రియేట్ చేస్తాడు. తద్వారా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అయిన జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడి పక్కన ఎలా నిలుస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…