Anil Ravipudi , Nagarjuna
Anil Ravipudi and Nagarjuna : మర్షియల్ సినిమాలు తీయాలంటే ఈ జనరేషన్ లో మన టాలీవుడ్ కి అనీల్ రావిపూడి మాత్రమే అని చెప్పొచ్చు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు జంధ్యాల, తర్వాత ఈవీవీ సత్యనారాయణ, ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో వచ్చిన శ్రీను వైట్ల, ఇప్పుడు శ్రీను వైట్ల స్థానంలో అనీల్ రావిపూడి అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు. అనీల్ రావిపూడి కి ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటే, ఆయన సినిమాలకు ఇక నుండి హీరో ఎవరు అనేది చూడరు, కేవలం అనీల్ రావిపూడి అనే బ్రాండ్ ని చూసి థియేటర్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టేస్తారు. అలాంటి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరోలలో వెంకటేష్, బాలకృష్ణలతో సినిమాలు చేసి వాళ్ళ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు. ఇప్పుడు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్నాడు.
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన, ఒక రెండు వారాల తర్వాత చేస్తానని అనీల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. సీనియర్ హీరోలందరినీ కవర్ చేస్తున్నారు, మరి నాగార్జున గారితో ఎప్పుడు సినిమా చేస్తారు అని అడగగా, దానికి అనీల్ రావిపూడి సమాధానం చెప్తూ ‘కచ్చితంగా నాగార్జున గారితో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. ఆయనతో హలో బ్రదర్ లాంటి ఎంటర్టైనర్ ని తీస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడంతో, హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తావా?, లేకపోతే హలో బ్రదర్ ని రీమేక్ చేస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. నాగార్జున ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. సీనియర్ హీరోలైన వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లకు వంద కోట్ల గ్రాసర్స్ ఉన్నాయి.
చిరంజీవి, వెంకటేష్ కి అయితే 100 కోట్ల షేర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఒక్క నాగార్జున కి మాత్రమే, కనీసం వంద కోట్ల గ్రాస్ సినిమాలు కూడా లేవు. అప్పుడెప్పుడో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘ఊపిరి’ చిత్రాలు మాత్రమే ఆయన కెరీర్ లో కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. మధ్యలో వచ్చిన సినిమాలన్నీ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. మధ్యలో జీరో షేర్ సినిమాలు, సింగిల్ డిజిట్ షేర్ సినిమాలను కూడా చూశాడు. అలాంటి పరిస్థితి నుండి ఆయన్ని కేవలం అనీల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ మాత్రమే కాపాడగలరు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుభేర’ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ఈ సినిమా లో నాగార్జున తో పాటు ధనుష్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.